Friday, April 26, 2024
- Advertisement -

ఇండియా టుడే స‌ర్వే..పెరిగిన జ‌గ‌న్ గ్రాఫ్‌..దిక్కుతోచ‌ని స్థితిలో చంద్ర‌బాబు…

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న బాబుపై పెరుగుతున్న ప్ర‌జావ్య‌తిరేక‌త‌, నేత‌లంద‌రూ పార్టీని వీడుతుంటంతో బాబు నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నారు. 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభం ఉన్న బాబు వ‌ల‌స‌ను ఆప‌డంలో చేతులెత్తేశారు. ఇప్ప‌టికే బాబు ప్రెస్టేష‌న్‌లో ఉంటే ఇండియా టూడే స‌ర్వే మ‌రో బాంబు పేల్చింది. తాజాగా ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌గురించి త‌న అంచ‌నాల‌ను ప్ర‌చురించింది. ఆరునెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింతగా పెర‌గ‌డంతోపాటు…బాబు గ్రాఫ్ త‌గ్గిపోయింది.

ఆరు నెల‌ల కింద‌ట జ‌గ‌న్ గ్రాఫ్ 43 శాతం ఉంటే అది ఇప్పుడు రెండు శాతం పెరిగి 45 శాతానికి పెరిగింది. అదే స‌మ‌యంలో టీడీపీ గ్రాఫ్ రెండు శాతం ప‌త‌నం అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్లో బాబుకు లభించిన మద్దతు శాతం 38 కాగా, ఇప్పుడు 36శాతానికి ప‌డిపోయింది.ప్రస్తుతానికి జగన్ కు 45శాతం మద్దతు ఉండగా, బాబుకు 36 శాతం మంది మద్దతు ఉందని ఇండియాటుడే వివరించింది. వ్యత్యాసం తొమ్మిది శాతం అని పేర్కొంది.


 ఇండియా టుడే సర్వే - దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు!

ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే ప‌వ‌న్ గ్రాఫ్ కూడా ప‌డిపోయింది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి పవన్ కు ఉండిన మద్దతు శాతం ఐదు కాగా, ప్రస్తుతం పవన్ గ్రాఫ్ నాలుగు శాతం వద్ద ఉందని పేర్కొంది. ఇత‌రుల‌కు ప్ర‌స్తుతానికి 15 శాతం గ్రాఫ్ ఉంద‌ని ఇండియా టుడే పెర్కొంది. 2014 ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప ఓట్ల‌శాతంతో ఓడిపోయిన వైసీపీకి ఈసారి తొమ్మిది శాతం అధికంగా ఉండ‌టంతో అధికారంలోకి వ‌చ్చేది వైసీపీ అని చెప్ప‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -