Saturday, April 20, 2024
- Advertisement -

తెలంగాణ లో ఆసక్తికర పరిణామం.. కేసీఆర్ ఎలా స్పందిస్తారో..?

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రస్థానం గురించి తప్పకుండా చెప్పాలి.. తెలంగాణ రావడానికి ముఖ్య కారణం  కాంగ్రెస్ అని అందరికి తెలిసిందే.. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఈ పార్టీ పరిస్థితి ఇక్కడ దారుణంగా తయారైంది.. వరుసగా రెండో సారి ఎన్నకల్లో ఓటమి చెందడంతో పార్టీ క్యాడర్ ఢీలా పడిపోయింది.. అయితే ఇక్కడి నేతలు ప్రతి పక్షం లో ఉంటూ అధికార పార్టీ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.. తాజగా వర్షాకాలం సమావేశాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించగా ఇవి గత పదిరోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈనెల 7 న ప్రారంభావగా ప్రారంభంలో రెవిన్యూ బిల్లులపైనా పెద్ద ఎత్తున చర్చ జరిగింది..

ఇక తాజాగా తెలంగాణ లో విచిత్రమైన పరిస్థితి నిన్న తలెత్తింది.. అసెంబ్లీ లో భట్టి విక్రమార్క అధికార ప్రభుత్వం పై డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో విమర్శలు చేశారు.. కాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ దానికి కౌంటర్ గా మీరు నాతో వస్తే పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాం అని చెప్పారు.. అయితే దాన్ని ఈ కాంగ్రెస్ నేత సీరియస్ గా తీసుకుని చూడడానికి ఈ గులాబీ నేత తో బయలు దేరి వెళ్లి డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ల నిర్మాణం పై ఓ లుక్ వేశారు.. అయితే లక్ష ఇళ్లను చుపిస్తామన్న తలసాని కొన్ని ఇండ్లను మాత్రమే చూపించారు..

దాంతో తలసాని లక్ష ఇండ్లను చూపించేవరకు ఇలా తిరుగుతూనే ఉంటామని మీడియా తో అన్నారు..
మొత్తం ఇప్పటి వరకు వెయ్యి ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. తర్వాత ఐమాక్స్ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు. అనంతరం సీసీనగర్, కొల్లూరు, అంబేద్కర్ నగర్ ప్రాంతంలో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. శుక్రవారం కూడా మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేత‌లు క‌లిసి ప‌ర్య‌టించ‌డం గ్రేట‌ర్ లో ఆస‌క్తిక‌రంగా మారింది. అసెంబ్లీ లో లేవ‌నెత్తిన అంశంపై ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యమ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -