Friday, April 19, 2024
- Advertisement -

ఉత్తర తెలంగాణ గుబులు.. టీఆర్ఎస్ లో భయం భయం

- Advertisement -

మున్సిపోల్స్ కు వెళుతున్న టీఆర్ఎస్ సర్కారుకు ఇప్పుడు ఉత్తర తెలంగాణ గుబులు పట్టుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లలో బీజేపీ చాపకింద నీరులా విస్తరించే ప్రక్రియను చేపట్టడంతో గులాబీ పార్టీకి కొన్ని కార్పొరేషన్లు కోల్పోవడం తప్పదా అని ఆందోళన ఆ పార్టీని పట్టి పీడిస్తోందట..

తాజాగా టీఆర్ఎస్ చేసుకున్న అంతర్గత సర్వేల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండ పురపాలికల్లో గులాబీ పార్టీకి బీజేపీ గట్టి పోటీనిస్తోందని.. ఆపార్టీ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అంచనాలు బలపడుతున్నాయట..

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ అసంతృప్తులను లాగేస్తున్నారు. ఈ మాజీ మాజీ ఆర్టీసీ చైర్మన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను లాగేసి బీజేపీలో చేర్చుకున్నారు. ఆయన రామగుండం కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేస్తానని శపథం చేశారు. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా నిజామాబాద్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేయడానికి మొత్తం రెడీ చేస్తున్నారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత యాక్టివ్ కాకపోతే నిజాబాబాద్ చేజారిపోయడం ఖాయమేనన్న అంచనాలున్నాయట..ఇక ఆదిలాబాద్ లోనూ బీజేపీ ఎంపీ ఆ మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారట..

ఇప్పుడు మున్సిపోల్స్ లో ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ కు గట్టి పోటీ నెలకొంది. ముగ్గురు ఎంపీలు టీఆర్ఎస్ అసంతృప్తులను టార్గెట్ చేసి పార్టీలో చేర్చుకొని గెలవాలని చూస్తున్నారు. ఈ ఎత్తుగడ టీఆర్ఎస్ లో ఆందోళనకు కారణమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -