తిన్నింటి వాసాలను లెక్కపెడుతున్న టీడీపీ..?

374
Is it destructive for the TDP to do this in the face of minorities
Is it destructive for the TDP to do this in the face of minorities

ఓటమి కొన్ని నెలల్లోనే టీడీపీ లో వచ్చిన మార్పు కు ప్రజలు, పార్టీ కార్యకర్తలు సైతం ఆశ్చర్య పోతున్నారు.. అయితే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుండేది.. కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా పార్టీ కి ఎంతో కొంత మైలేజ్ అయితే వచ్చి ఉండేది. కానీ చంద్రబాబు చర్యలతో పార్టీ ని ప్రజలకు మరింత దూరం చేస్తున్నారే తప్పా ప్రజల కు నచ్చే విధంగా మాత్రం ముందుకు పొవట్లేదు.. తాజాగా జరిగిన అంతర్వేది ఘటనలో టీడీపీ తీరును గమనిస్తే మైనార్టీ ఓట్లను పణంగా పెట్టి టిడిపి హిందుత్వాన్ని భుజానికెత్తుకుందా అన్న సందేహాలు కలగక మానదు..

ఈ విషయంలో బీజేపీ ని మించిపోయి ప్రవర్తిస్తున్నట్లు గా అర్థమవుతుంది. ఇటీవలే అంతర్వేది ఆలయ రథం దగ్ధం కాగా బీజేపీ జనసేనలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది.. అయితే దీనిపై జగన్ సిబిఐ కి విచారణకి ఆదేశాలు ఇవ్వగా ఆ పార్టీ లు ఆందోళనను కొంత తగ్గించాయి.. అయితే టీడీపీ మాత్రం దీన్ని ఇంకా రాజకీయం చేస్తూ బలపడే దిశగా అడుగులేస్తోంది..

ప్రజలు ఇబ్బందిపడే అంశాన్ని తీసుకుని పోరాటం చేయాల్సిన టీడీపీ ఇలా దేవుడి విషయంలో అనుకోకుండా జరిగిన ఓ విషయాన్నీ ఐనతలా రాద్ధాంతం చేయడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. రాజనుహేంద్రవరంలో గత కొన్ని రోజులుగా వివిధ ఆలయాల వద్ద హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టాలని, ఆంతర్వేది రథం దగ్ధం కేసులో దోషులను ఆరెస్టు చేయాలన్న డిమాండ్తో ఈ ఆందోళనలు సాగుతున్నాయి. ఈ ఆందోళనలో తెలుగుదేశం పార్టీ కొంత హడావుడి చేస్తుండడం కొంత అనుమానాలకు దారితీస్తుంది. గోద్రా అల్లర్లలో మోడీ ని వ్యతిరేకించి మైనార్టీ ల అండతో 2014 లో అధికారంలోకి వచ్చిన బాబు ఇలా చేతులెత్తేసి హిందుత్వ బాట పట్టడం వారికి ఎలా మింగుడు పడేటట్లు చేస్తుందో చూడాలి..

Loading...