Thursday, April 25, 2024
- Advertisement -

సెంటిమెంట్ ను పక్కన పెట్టేసిన జగన్.. కానీ..!

- Advertisement -

ఏడాది పూర్తయింది మంచి సీఎం అనిపించుకుంటానని జగన్ ఏడాది కిందట తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ప్రజలకు హామీ ఇచ్చారు. దీనికి ఆయన విధించుకున్న టైం ఆరుమాసాలు కానీ ఇప్పుడు ఈ ఏడాది దాటి మూడు మాసాలు అయింది. మరి ఇప్పుడు ఆయన మంచి సీఎం అనిపించుకున్నారా ? ఆయన నిర్ణయాలకు ప్రజలు జై కొడుతున్నారా ? సీఎంగా జగన్ అద్భుతాలు చేస్తున్నారని అంటున్నారా ? జగన్ ప్రభుత్వంలో మాకు కంటి నిండ నిద్ర పడుతుందని ఫీల్ అవుతున్నారా ? మరి ఈ విషయంలు తెలిసేది ఎలా ? ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజలకు చేరుతుందో లేదో తెలుసుకునేదెలా ? ఇంత టెక్నాలజీ ఉన్నా.. ఎన్ని సర్వేలు ఉన్న నేరుగా ప్రజలు నోటి నుంచి నువ్వే ఉత్తమ సీఎం అని అనిపించుకుంటేనే కదా జగన్ ఆశయం ఫలించేది.

ఈ నేపథ్యంలోనే జగన్ మరో సంచలన నిర్ణయంను తీసుకోబోతున్నారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. దీనికి ఆయన గ్రామసభ లేదా రచ్చబండ అని పేరు పెట్టాలని చూస్తున్నారు. అయితే ఇక్కడే ఆయనను సెంటిమెంట్ వేధిస్తోందని అంటున్నారు వైసీపీలో సీనియర్లు. గతంలో 2009లో రెండో పర్యాయం విజయం సాధించిన జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇది కార్యక్రమం నిర్వహించారు. రెండో దఫా గెలిచిన తర్వాత ప్రజల నాడి తెలుసుకునేందుకు అత్యంత తక్కువ సమయంలోనే ప్రజలతో నేరుగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. 2009 సెప్టెంబర్ 2 ఆయన రచ్చబండ నిర్వహణకు నిర్ణయించి అదేరోజు హెలికాప్టర్లో వెళ్లారు. అయితే అనూహ్యరీతిలో అది ప్రమాదానికి గురై వైఎస్ దిగంతాలకు వెళ్ళిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రజలను చేరుకునేందుకు చేయడం కూడా సిద్ధమయ్యాడు.

ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రజా నాడిని నేరుగా తెలుసుకునేందుకు ఆయన రెడీ అయ్యారు. తన తండ్రి స్ఫూర్తితో రచ్చబండ అనే పేరుతో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. కానీ జగన్ మాతృమూర్తి విజయలక్ష్మి మాత్రం దీనికి మరో పేరు పెట్టుకోవాలని సూచించారని తెలిసింది. దీంతో గ్రామ సభ అనే పేరును ఖరారు చేయనున్నట్లు తెలిసింది. అదే సమయంలో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన నేపథ్యంలో జగన్ ఈ కార్యక్రమానికి వినియోగించకూడదు పార్టీ సీనియర్లు కోరుతున్నట్లు సమాచారం. ఆ కార్యక్రమానికి హెలికాప్టర్ కి సెంటిమెంట్ ఉందని అంటున్నారు. దీంతో జగన్ కూడా ఈ సెంటిమెంట్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. సెప్టెంబర్లోనే కార్యక్రమాన్ని ప్రారంభించిన హెలికాప్టర్ వినియోగించకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

సీఎం జగన్ పై పూరి జగన్నాధ్ ప్రశంసలు..!

కృష్ణ జిల్లాలో ఆ వైసీపీ ఎమ్మెల్యే టాప్ లో ఉన్నాడట..!

సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్

108 సిబ్బందికి జీతాలను భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -