Thursday, April 25, 2024
- Advertisement -

లోకేష్ పని అయిపోయిందా ? ఇక అరెస్టేనా ?

- Advertisement -

ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ నిమిషయం ఎలా మారుతున్నాయో ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. అధికార పార్టీలు తీసుకుంటున్న నిర్ణాయలపై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇంకోపక్కా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాలను వైసీపీ ప్రభుత్వం బయటకు తీసే ప్రయత్నాలు చేస్తోంది.

ఇటివలే రాజధాని అమరావతి భూ కుంభకోణంపై సీట్ దర్యాప్తు మొదలు పెట్టిన ఏపీ ప్రభుత్వం తాజాగా ఏపీ ఫైబర్ నెట్,సెటాప్ బాక్స్ ల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. దాదాపుగా ఫైబర్ నెట్ లోనే 700 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని భావించిన ఏపీ కేబినేట్ ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో టీడీపీ లీడర్లకు ఊహించని షాక్ తగిలినట్లు అయింది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తమపై టార్గెట్ గా దాడులు చేస్తున్నారని ఇవన్నీ కక్షపూరి చర్యలని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

అయితే ప్రధానంగా ఫైబర్ గ్రిడ్ కేసు లోకేష్ మెడకు చుట్టుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. ఈ చర్చే టీడీపీ నేతల్లో మొదలై ఆందోళనలో పడినట్లు తెలుస్తోంది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఫైబర్ నెట్ కి చెందిన సెట్ అప్ బాక్స్ ల కేసుల విషయంలో విచారణకు లోకేష్ ను రమ్మని నోటీసులు అధికార్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 3 లక్షలుపైనే సెట్ అప్ బాక్స్ లు కొన్నట్లు గుర్తించారు. అవి ఎక్కడ ఉన్నాయో అనేది ఎవరికి తెలియని విషయం. అయితే 460 రూపాయల సెట్ అప్ బాక్స్ ని దాదాపుగా 2600 రూపాయలకు కొన్నట్లు భావిస్తున్నారు. ఏది ఏమైన టీడీపీ హయంలో చాలా మంది జగన్ జైలు జీవితాన్ని పదే పదే గుర్తి చేసి విమర్శలు చేశారు. అందుకే టీడీపీ హయంలో జరిగిన అవినీతిని బయటకు తీసి దోషులను జైలుకు పంపే వరకు వైసీపీ సర్కార్ నిద్రపోయేలా లేదు అన్నట్లు తాజా పరిణామాలు చూస్తే అర్దం అవుతోంది.

ఇక మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అక్రమ కేసులలో అరెస్టు చేశారని నారా లోకేష్ అన్నారు. తాడిపత్రి వెళ్లి ఆయన జెసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. తనకు ఫైబర్ గ్రిడ్ కేసులో సంబందం ఉందని వార్తలు వస్తున్నాయి. అది పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖకు సంబంధించిందని.. తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. గతంలో వైసీపీ ఆరు లక్షల కోట్ల రూపాయల ఆరోపణలు చేసిందని, ఎక్కడ రుజువు చేశారని లోకేష్ సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబూ..నీవు మనిషివా?.. దున్నపోతువా?

వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సీఎం కేసీఅర్ సంచలన నిర్ణయం

మంచి మనసున్న సీఎం అనిపించుకున్న జగన్..!

జగన్ పాలనపై జేడీ లక్ష్మీనారాయణ షాకింగ్ కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -