Wednesday, April 24, 2024
- Advertisement -

మోడీ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడా….?

- Advertisement -

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతి రోజు సుమారు లక్ష కొత్త కేసులతో పాటు వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.

సెప్టెంబరు 23న ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల సీఎంలతో చర్చలు జరపననున్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పరీక్షల తీరు, వైద్య సదుపాయలు వివరాలను తెలుసుకోనున్నారు.

సెప్టెంబరు నెలలో ప్రతి రోజు సుమారు లక్ష కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒక్క నెలలోనే 16,86,769 మందికి కరోనా నిర్ధారణ అయింది. జులై మధ్యలో 7.5 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ఇప్పుడు 10.58కి చేరింది. మన దేశంలో టెస్టుల సంఖ్య కూడా గత నెలతో రెట్టింపయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -