Thursday, March 28, 2024
- Advertisement -

పార్టీ మార‌డంపై స్పందించిన అవంతి…?

- Advertisement -

రాజ‌కీయాల్లో నేత‌ల‌కు కావాల్సింది అధికారం, ప‌ద‌వులు, సీట్లు. ఇది త‌ప్ప వేరేది ఉండ‌ద‌నేది చూస్తూనే ఉన్నాం. ఉన్న పార్టీలో టికెట్ రాకుంటే…మ‌రో పార్టీలోకి జంప్ చేయ‌డం నాయ‌కుల‌కు అల‌వాటుగా మారింది.అలాంటి రాజ‌కీయ నాయ‌కులు కోకొల్ల‌లు. ఇలాంటి వారి లో తాజాగా మ‌రో పేరు తెర‌పైకి వ‌చ్చింది.

అయిన ఎవ‌రో కాదు విశాఖ‌జిల్లా అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌. ఆయ‌న టీడీపీకీ గుడ్ బాయ్ చెప్పి ఈనెల 21న వైసీపీలో చేరుతున్న వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. స‌ద‌రు ఎంపీ టీడీపీకీ న‌మ్మిన బంటుగా మంత్రి గంటా శ్రీనివాస్ రావు మాట‌ను తూచా త‌ప్ప‌కుండా పాటించిన నాయ‌కుడిగా పేరుంది. అయితే గంటాతో విబేధాలు ఏర్ప‌డ్డాయంట‌. దాంతో త‌న దారి తాను చూసుకొనేందుకు రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం.

పార్టీ మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఈసారి ఎన్నిక‌ల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారంట‌. గ‌తంలో ఆయ‌న గెలిచిన భీమిలీ నియోజ‌క వ‌ర్గాన్ని మ‌రో సారి కోరుతున్నారంట‌. ప్ర‌స్తుతం అక్క‌డ నుంచి గంటా శ్రీనివాస‌రావు ప్రాతి నిధ్యం వ‌హిస్తున్నారు.

ఈ విష‌యంలో గంటా అవంతికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారంట‌. తాను భీమిలి నియోజ‌క వ‌ర్గాన్ని వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని..ఇద్ద‌రూ సై అంటే సై అంటున్నారంట‌. మ‌రో వైపు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఆస్థానాన్ని అవంతి శ్రీనివాస్‌కు ఇచ్చేది లేద‌న్న‌ట్లు స‌మాచారం. ఇక చేసేది లేక‌నే ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధ‌మ‌య్యారంట‌.

అవంతి శ్రీనివాస్ ఎప్పుడు చేరేది తారీకుతో సహా ప్రకటించడంతో తెలుగుదేశం అధిష్టానం రంగంలోకి దిగి బుజ్జగింపులు పర్వానికి దిగినట్లు తెలుస్తుంది. కానీ అవంతి శ్రీనివాస్ ముందుగానే పక్కా ప్లాన్ చేసుకొని వైసిపి పార్టీలో చేరనున్నట్లు కనపడుతుంది. అదే జ‌రిగితే టీడీపీ పెద్ద మైన‌స్సే.

అధికార పార్టీలో ఉన్న ఎంపీ ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లబోతున్నారనే వార్త‌ల‌పై అవంతి స్పందించారు. తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాను వైసీపీలో చేరబోతున్నట్లు దుష్ప్రచారం జరుగుతోందని అవంతి ఆరోపించారు. పార్టీ మారేముందు అంద‌రు మాట్లాడే మాట‌లే ఇప్పుడు ఎంపీగారు మాట్లాడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -