Thursday, April 25, 2024
- Advertisement -

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

- Advertisement -

అధికార పక్షం, ప్రతిపక్షం.. ఏ రాష్ర రాజకీయాలకైనా, ఏ దేశ రాజకీయాలకైనా ఈ రెండు ఆయువు పట్లు.. పార్టీ లు ఎన్నైనా ఒక రాష్ట్రంలో అధికార పక్షం ఒకటి , ప్రతిపక్షాలు మిగిలినవిగా గుర్తిస్తారు.. ఈ ఐదేళ్లు అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలను పరిపాలిస్తుండగా ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసే తప్పుల్ని, అన్యాయాల్ని వేలెత్తి చూపి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి.. అయితే ఈ రెండు పార్టీ లు చేసేది ప్రజల మేలు కోసమే అయిన అధికారంలో ఉన్న పార్టీ మాటే ఎప్పుడు చెల్లుతుంది.. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్నా కూడా తమ మాట చెల్లుబాటు అయ్యేలా చూస్తుంది టీడీపీ.. కానీ జనం బుద్ధి చెప్పినా వారు మారారు.. జనాలు అధికారం నుంచి దింపినా ఇంకా ఆ భ్రమలోనే చంద్రబాబు ఉండడం ప్రజలకు విడ్డూరంగా ఉంది..

ఇక ప్రతిపక్షం చేయాల్సిన ఏ పని కూడా టీడీపీ సరిగ్గా చేయడం లేదని వాదన బలంగా బయటికి వస్తుంది.. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించడం మానేసి స్వా లాభం కోసం పాకులాడుతున్నారు.. లేని పోనీ విమర్శలు చేస్తూ జగన్ కి చిరాకు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందంటే రాష్ట్రంలో ఏ చెడ్డ పని జరిగినా అది బాబు వల్లే జరిగిందని చెప్తున్నారు.. నిజానికి ఇది నిజమే అయినా అది రుజువు చేస్తే బాగుండేది..

74 ఏళ్ల వయసులో ఆయన ఎంత కాలం రాజకీయం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు మాత్రమే ఏపీ ప్రభుత్వ పెద్దలకు కనిపిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఏం జరిగినా.. తాము స్వయంగా తెచ్చి పెట్టుకున్నదే అయినా.. చంద్రబాబే చేయిస్తున్నారని కలవరపడుతున్నారు. నిజంగానే కలవరపడుతున్నారో లేక… అలా ప్రజలను నమ్మించి… చంద్రబాబును బూచిగా చూపి.. తాము గండం గట్టెక్కాలనుకుంటున్నారో కానీ… అన్నింటికీ చంద్రబాబునే బూచిగా చూపించడం ప్రారంభించారు. దాంతో చంద్రబాబు పూర్తి విలన్ గా మారిపోతున్నారు.. ఏదేమైనా వారు చేసే ఆరోపణల్లో నిజం లేకపోతె చంద్రబాబు ను ఎందుకలా విమర్శిస్తారు.. మరి ఇలాంటి రాజకీయాన్ని చంద్రబాబు ఎప్పుడు ఆపుతారో చూడాలి..

చంద్రబాబు అవినీతి కి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు.?

చంద్రబాబు ఈ పిచ్చి నమ్మకానికి కారణం ఇదేనా..?

చంద్రబాబు కు ఇప్పుడు వాళ్ళే దిక్కా..?

అయోమయంలో టీడీపీ ఇన్ ఛార్జ్ లు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -