Friday, March 29, 2024
- Advertisement -

కంచుకోటలో టీడీపీ దుకాణం బంద్.. గట్టి దెబ్బ కొట్టిన జగన్.!

- Advertisement -

చంద్రబాబు రాసినటువంటి కొత్త లేఖ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ముందు ఆ లేఖ సంగతి చూసి తర్వాత టీడీపీ పరిస్థితి ఎక్కడ భారీ దెబ్బ తగిలిందో చూద్దాం. రాష్ట్రంలోని ఈ మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించినటువంటి ఏపీ వికేంద్రీకరణ వ్యవహారం బిల్లుని ఏ ముహుర్తాన రాజ్ భావన్ గడప తొక్కిందో కానీ లేఖల మీద లేఖలు గవర్నర్ కు చేరుకుంటున్నాయి.

ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి శాసనమండలిలో సభా పక్ష నేత యనమల రామకృష్ణుడు గవర్నర్కు లేఖ రాశారు. వికేంద్రీకరణ బిల్లును అమోదించవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా లేఖ రాసుకొచ్చారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సౌరథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కొత్త సమస్యలు వస్తాయని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం వ్యవహార శైలిపట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.

అనాలోచితంగా ముందు చూపు లేకుండా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అందులో భాగంగానే ఏపీ వికేంద్రీకరణ సీఆర్డీ బిల్లును రూపొందించిందని విమర్శించారు. దీనివల్ల ప్రాంతీయ విభేదాలు వచ్చే ఛాన్సు కూడా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. కానీ ప్రజలకి మంచి చేస్తుందనే ఫీలీంగ్ తోనే గవర్నర్ ఉన్నారని ఖచ్చితంగా ఆమోదించి తీరుతామని వైసీపీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. మరోపక్క టీడీపీని ఒక బలమైన కంచుకోటలో దెబ్బ తీశారు జగన్మోహన్రెడ్డి. అధికారం ఎప్పుడైతే కోల్పోయిందో నియోజకవర్గాల్లో సాధారణంగా ఏ పార్టీ అయినా సరే పట్టుకోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. టీడీపీ ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు నుంచి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం లో చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అక్కడ ఉన్నటువంటి పొన్నపురెడ్డి కుటుంబం దానికి అంటే టిడిపి పార్టీకి చాలా అండగా నిలుస్తూ ముందుకు సాగేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు టీడీపీకి అతి పెద్ద దెబ్బగా మారుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు మూడు దశాబ్దాలుగా అంటే 30 సంవత్సరాలుగా జమ్మలమడుగు నియోజకవర్గం లో ఒకే కుటుంబం టీడీపీ వైపు నిలబడుతుంది చాలా స్ట్రాంగ్ గా.

2019 ఎలక్షన్లో కాదు గాని 2014 ఎలక్షన్లో చంద్రబాబు తీసినటువంటి ఒక బ్యాడ్ డిసిషన్ టీడీపీ తలరాతని ఈ ప్రాంతాల్లో మార్చేసింది. 2014 ఎన్నికల్లో రామ సుబ్బారెడ్డి టీడీపీ నుంచి జమ్మలమడుగులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జంపింగ్ ల వ్యవహారంలో దూకుడు ఉండేటివంటి టీడీపీ అదే నియోజకవర్గం నుండి కూడా ఆదినారాయణరెడ్డి పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి కూడా ఇచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి మళ్లీ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత టీడీపీ నుంచి వైకాపాకు జంప్ అయ్యారు. ఆ ప్రాంతంలో సుధీర్ రెడ్డి గెలుపు వచ్చింది. ఆదినారాయణరెడ్డి ఎన్నికల తర్వాత బిజెపిలో చేరి పోయారు.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అసలు నేత అనే వ్యక్తి లేకుండా పోయారు. అసలు ఇన్చార్జి పదవి చేపట్టాలని కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో సరైన నేతే లేరంటున్నారు టీడీపీ పార్టీకి. వైసీపీ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గంలోని చాలా స్ట్రాంగ్ గా దూసుకుపోతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి స్కేచ్ అని ఇది తిరుగులేని కోలుకోలేని స్ట్రాంగ్ దెబ్బకొట్టడానికి టీడీపీ కంచుకోట బద్దలు కొట్టడానికి 2014 నుంచి జగన్ ప్లాన్ వేస్తూ ఇప్పుడు సక్సెస్ అయ్యారని అంటున్నారు విశ్లేషకులు.

ఆ ఇద్దరు మంత్రులకు చెక్ పెట్టనున్న సీఎం జగన్ ?

లోకేష్ బాబుకు భారీ షాక్ ఇచ్చేందుకు ప్లాన్ వేసిన జగన్..!

ఇది వర్క్ వట్ అయితే వైసీపీలోకి బాలయ్య ?

సీఎం జగన్ చికెన్ తినడం ఎందుకు మానేశారో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -