Thursday, April 25, 2024
- Advertisement -

దేశం కోసం అండగా ఉంటాం.. ప్రధానితో సీఎం జగన్..!

- Advertisement -

భారత జవాన్లపై సరిహద్దులో చైనా దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంక్షోభ సమయంలో కేంద్రం ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష నాయకుల వీడియో కాన్ఫరెన్స్ లో వైసీపీ అధినేతగా జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20మంది సైనికులు దుర్మరణం చెందడం పై జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.

ఇందుకు ప్రతిగా తీసుకునే ఎలాంటి నిర్ణయానికైన తమ మద్దతు ఉంటుందని తెలిపారు. నాయకులంతా ఒక్కటై వారికి అండగా నిలవాలని సూచించారు. ప్రస్తుత అణ్వస్త్ర యుగంలో ప్రపంచం మారుతోందని సైనికులతో మాత్రమే యుద్ధం చేయలేమని పేర్కొన్నారు. దౌత్యం ఆర్థిక ఆంక్షలు అంతర్జాతీయ ఒత్తిడి వంటి ఇతర రూపాలనూ అనుసరించాలని చెప్పారు. 2014 నుంచే అంతర్జాతీయంగా ప్రధాని మోడీ నాయకత్వంలో మనదేశం గౌరవం ప్రతిష్ఠ ఇనుమడించిందని కొనియాడారు.

ఇది నచ్చని కొన్ని శక్తులు కావాలని జరుపుతున్న దాడులు ఇవని అన్నారు. 192 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితిలో దేశం.. 184మంది సభ్యుల మద్దతుతో భద్రతామండలిలో సభ్యదేశంగా మారడం.. మోడీ అసాధారణ నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుత ఈ సమయంలో వైసీపీ అధినేతగా ఏపీ సీఎంగా మోడీ వెంట ఉంటానని జగన్ ప్రకటించారు. ఏపీలోని 5 కోట్ల మంది కూడా మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. దేశ భవిష్యత్తు భద్రంగా ఉండబోతోందని ఆశాభావం సీఎం జగన్ వ్యక్తం చేశారు.

ఏపీ నుంచి కొత్త రాజ్యసభ సభ్యులు వీరే..!

వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా : సీఎం జగన్‌

ఏపీ బడ్జెట్‌ ప్రధాన అంశాలు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే ?

లోకేష్ పని అయిపోయిందా ? ఇక అరెస్టేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -