Friday, April 26, 2024
- Advertisement -

వాటిని జగన్ పట్టించుకోవడం ఎప్పుడు మానేశారట…!!

- Advertisement -

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పై కొన్ని ఎల్లో మీడియా లు పనిగట్టుకుని విష ప్రచారాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. జర్నలిజం విలువలను మరిచిపోయి, రాష్ట్రం గర్వించదగ్గ పదవిలో ఉన్న సంగతి చూడకుండా, దేనికి పదును పెట్టారో తెలియక ఇలాంటి నీచమైన పనులకు వారు తమ చదువును వాడుకోవడం చాల హాస్యాస్పదంగా వుంది.. ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను, అలాగే జగన్ దూకుడును, పార్టీ నేతల వ్యవహారశైలిని అన్ని పూసగుచ్చినట్లు చేదుగా రాయడంలో ఆ మీడియా సంస్థలు సఫలమయ్యాయి.. అయితే ఇవి పట్టించుకునే స్థితిలో గానే, టైం గానే అధికార పార్టీ కి లేవు.. ఎందుకంటే ప్రజలు నాయకుడిగా వచ్చి సీఎం గా ఎదిగిన జగన్ ప్రజలే అసలైన మీడియా.. పని జరగకపోతే, పాలనా జరగకపోతే వారే తనకు పలానా లోపం ఉందని చెప్తారు.. కానీ ఇలా పైడ్ సంస్థలు లేనిపోనివి రాస్తే జగన్ పట్టించుకునే స్టేజి ఎప్పుడో దాటేశారు.. నిజానికి జగన్ వారిని పట్టించుకుంటే ఒక్క రోజు పని కానీ ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఎల్లో పార్టీ ని ఈ విధంగా దెబ్బకొట్టే రాజకీయం తాను చేయొద్దనుకుంటున్నాడు..

ఇక ఇలా ఎల్లో మీడియా విషపు రాతలు రాయడం కొత్తేమి కాదు.. గతంలోనూ జగన్ పై ఇష్టం వచ్చినట్లు రాసేవారు.ఇప్పుడైనా ఒకటికి రెండు సార్లు రాద్దామా అని ఆలోచిస్తున్నారేమోకానీ అప్పుడు మాత్రం జగన్ పై ఇష్టమొచ్చిన రాతలు రాసేవారు.. అధికారంలో ఉన్న తమ పార్టీ అనే గర్వంతో ప్రజలకు జగన్ గురించి చెడువార్తలని చేరవేశారు.. కానీ జగన్ పై నమ్మకాన్ని ఉంచిన ప్రజలు అవేవీ నమ్మకపోగా ఎల్లో మీడియా కి తగిన బుద్ధి ఎన్నికల్లో చెప్పి వాల్ల నోళ్లు మూయించారు.. సీఎం అయిన తర్వాత జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా వారు విషం చిమ్ముతూ చెడువార్తలు రాస్తున్నారు.. పథకాలు బాగా అమలయినా కూడా అందులో అవినీతి జరుగుతుందని చెప్పి ప్రజల్లో విష బీజం నాటే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో చెప్పిన విధంగా పథకాలు తమకు చేరుతున్నాయి.. దీనిలో ఎలాంటి అవినీతి లేదని ప్రజలు తిరిగి సమాధానం ఇస్తున్నారు..

ఇక సోషల్ మీడియా ద్వారా వ్యతిరేఖ పోస్టులు పెడుతూ అధికార పార్టీ ని కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడెక్కడో ఇతర దేశాల్లో ఈ విధంగానే ఇస్తే ప్రజలు దెబ్బయిపోయారంటూ ఉదాహరణలతో కూడిన పోస్టులను సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా తెచ్చిపడేస్తున్నారు.  అభివృద్ధే లక్ష్యం గా సాగిపోతున్న వైసీపీ పార్టీ ఎదుగుదల ను చూసి ఓర్వలేక చంద్రబాబు అండ్ కో ఈవిధంగా తనకు గతంనుంచి అచ్చోచ్చిన మీడియా ను ఉపయోగించుకుని ఈవిధంగా జగన్ ను  అన్ పాపులర్ చేయాలనీ చూస్తున్నారు.. ఇది ఇదేవిధంగా కొనసాగితే మాత్రం ఎదో ఒకరోజు ప్రజలు డైరెక్ట్ గా ఎల్లో మీడియా కి బుద్ధి చెప్పాల్సి వస్తుంది.. ఇప్పటికే టీడీపీ కి తగిన గతి పట్టించిన ప్రజలు ఎల్లో మీడియా కి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే రావాలని కోరుకుందాం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -