Thursday, March 28, 2024
- Advertisement -

జగన్ బీజేపీ మేలుకోసం ఇంత చేస్తున్నారా..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవొస్తుంది.. ఇప్పటివరకు అయన ప్రతిపక్షాలను విమర్శించే దానికంటే ఎక్కువగా ప్రజలకు సేవ చేయడంలోనే దృష్టి పెట్టారని స్పష్టంగా తెలుస్తుంది.. సంక్షేమ పథకాల్లో అయన దార్శనికత ప్రజలకు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది.. ప్రతి పథకంలో అయన ఏవైనా లోపాలు ఉన్నాయని చూసుకుంటూ ముందుకు వెళ్లడం ప్రజలకు ఎంతో నచ్చుతుంది.. ఇక కేంద్రంలో జగన్ బీజేపీ తో ఉన్న సన్నిహితం గురించి అందరికి తెలిసిందే.. మోడీ ని పొగిడిన చోట పొగడకుండా పోగొడుతున్న జగన్ పై సెంట్రల్ బీజేపీ సానుకూలంగా నే ఉంది.. అమిత్ షా అయితే జగన్ పై అమితమైన ప్రేమను చూపిస్తారు..

అయితే జగన్ కి సెంట్రల్ బీజేపీ నే కాకుండా రాష్ట్రంలోని బీజేపీ పై కూడా కొంత ప్రేమ ఉందట.. తనతో బీజేపీ నేతలు వ్యవహరించే తీరు ఒక కారణం అయితే టీడీపీ పైన ఉన్న కోపం మరో బలమైన కారణమని తెలుస్తుంది.. జగన్ అధికారంలో ఉన్నాడు కదా అని విమర్శించకుండా , డిమాండ్ చేయకుండా సూచన ఇస్తున్నట్లు గా తమ డిమాండ్ లను చెప్పడంతో బీజేపీ నేతల తీరుకి జగన్ ఎంత గానో ఫిదా అయ్యారట… రాష్ట్ర బీజేపీ సభ్యులకు అధిష్టానం నుంచి సూచనలు అందాయో తెలీదు కానీ బీజేపీ పార్టీ వైసీపీ తర్వాత రాష్ట్రంలో ప్రధాన పక్షం గా మారాలని సీఎం జగన్ వారి పట్ల కొంత సానూకూలంగా ఉన్నారట.. అయితే ఇది టీడీపీ వారికి మింగుడు పడడడం లేదు..

ఇటీవలే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో బీజేపీ హస్తం కూడా ఉందన్నది బహిర్గతమే.. ఆన్ లైన్ జూదం బహిష్కరణ విషయంలో ఎంతలేదన్నా బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి రాసిన లేఖ ఆధారంగానే జగన్ ఆ నిర్ణయం తీసుకున్నాడు.. ఇక ఎండీవోలను డీడీఓలుగా ప్రమోషన్ ఇచ్చే విషయంలో సోము వీర్రాజు హస్తం ఎలానో ఉంది. అంతేకాకుండా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అప్పుడెప్పుడో లేవనెత్తిన తిరుమల కాగ్ విచారణ కు జగన్ ఇప్పుడు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షం చెప్పింది అని పక్కన పెట్టకుండా జగన్ వాటిని స్వాగతించడం బీజేపీ వర్గాల్లో కొంత హుషారు తెచ్చిందట.. అయితే జగన్ ఇలా వారిలో ఉత్సాహం నింపడానికి కారణం  తన రాజకీయ బద్ధ శత్రువు అయిన టీడీపీ ని తన చేతులకు మట్టంటకుండా బీజేపీ ద్వారా నామరూపాల్లేకుండా చేయాలన్నదే అయన ఉద్దేశ్యమని అంటున్నారు. మరి జగన్ రచించిన ఈ రాజకీయ పద్మవ్యూహాన్ని చంద్రబాబు ఎలా ఛేదిస్తారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -