అమరావతి ప్రజలకు జగన్ బంపర్ ఆఫర్..?

981
Jagan standing next to Amravati Babu's work cut
Jagan standing next to Amravati Babu's work cut

రాష్ట్రాభివృద్ధి లో భాగంగా జగన్ మూడు రాజధానులను సృష్టించి అమరావతి ప్రజలకు ద్రోహం చేశాడని టీడీపీ వర్గాలు అమరావతి లో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు అవన్నీ ఒట్టి అపోహలు, టీడీపీ తమ రాజకీయ ఉనికిని చాటడానికి ఇలా అబద్ధపు ప్రచారకం చేస్తున్నారు అని చెప్తూ అమరావతి ప్రజలను అక్కున చేర్చుకునేది తమ ప్రభుత్వం అని చెప్తున్నారు.. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అక్కడి ప్రజలకు తమ తరపున భరోసా ఇచ్చేనందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది.. వాస్తవానికి అమరావతి లో పోరాటం చేసేది రైతులు కాదు టీడీపీ నుంచి లాభం పొందిన కొందరు భూబకాసురులు అని వైసీపీ వారు భావిస్తున్నారు..

నిజానికి బాబు హయాంలో రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం , దండాలు జోరుగా సాగాయి. అంతమాత్రాన ఈ పోరాటంలో రైతులే లేరు అని ఏమాత్రం చెప్పలేం.. వారిని ఎందుకు ఈ ప్రభుత్వం గుర్తించడం లేదు అన్నది ఇన్నాళ్ళూ మేధావులకు వచ్చిన పెద్ద ప్రశ్న. ఇపుడు ఎవరు చెప్పారో తెలియదు కానీ ప్రభుత్వం కళ్ళు తెరచింది. రైతులతో చర్చలకు రెడీ అవుతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి.

రాష్ట్రం మొత్తం ప్రజలకు బాధ్యత వహించే దిశగా వైసీపీ అధికారంలోకి వచ్చింది.. అదే విధంగా ఈ ప్రాంతపు వారిని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని నిర్ణయానికి రాగ కొడాలి నాని వంటి కొందరు నేతలు ఇక్కడ బ్లాక్ మెయిల్ తో వారిని మరింత భయపెడుతూ కలవరపాటుకు గురి చేస్తునారు.. మీకు శాసన రాజధాని కూడా ఉండదని వారిని బెదిరిస్తూ ఉంటే దీనివల్ల సమస్య పెరిగిపోతోందే తప్పా తగ్గదు అని కొందరు రాజకీయ విశ్లేషకులు

అభిప్రాయపడుతున్నారు.. కొడాలి నాని మేము చర్చలకు సిధ్ధమని మీడియా వేదికగా అంటున్నారు, కానీ అది ఆచరణలో చూపాలి. ఎంత తొందరగా రైతులను దారికి తెచ్చుకుంటే అంత వేగంగా జగన్ సర్కార్ మూడు రాజధానుల కధ సుఖాంతం అవుతుంది. లేదంటే వచ్చే ఎన్నికల్లో దీనిద్వారా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది..

Loading...