Friday, March 29, 2024
- Advertisement -

క‌డ‌ప‌లో బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ నేత‌లు

- Advertisement -

ఒక వైపు సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మరం…. మ‌రోవైపు టీడీపీలో నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయ‌ని ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు. అయితే ఇప్ప‌ట్లో అసెంబ్లీ సీట్లు పెర‌గ‌వ‌ని కేంద్రం తేల్చేయ‌డంతో …ఆ ఫిరాయింపులే బాబు మెడ‌కు చుట్టుకుంట‌న్నాయి.

మొద‌టి నుంచి పార్టీలో ఉన్న నేత‌ల‌కు, ఫిరాయించిన నేత‌ల మ‌ధ్య పొస‌గ‌డంలేదు. సంక్రాంతి తర్వాత అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించ‌నున్న బాబు ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తున్నారు. స‌ర్వేల ఆధారంగా టికెట్ల‌ను కేటాయిస్తాన‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. క‌డ‌ప‌లో జ‌గ‌న్‌కు చెక్ పెట్టాల‌ని వ్యూహాలు ప‌న్నుతున్న బాబుకు …సొంత పార్టీ నేత‌ల మ‌ధ్య అధిప‌త్య‌పోరు ఇబ్బందుల‌కు గురి చేస్తోంది.

అభ్య‌ర్తుల ఎంపిక‌లో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగు సీటు విషయమై చంద్రబాబునాయుడు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డితో అర్ధ‌రాత్రి నుంచి 3 గంట‌ల వ‌ర‌కుచర్చ‌లు జ‌రిగాయంట‌. మీరేం చెబితే దానికే కట్టుబడి ఉంటాం అని బంతిని ముఖ్యమంత్రి కోర్టులోకే నెట్టారంట‌.

అయితే ఇద్ద‌రిలో ఎవ‌రికో ఒక‌రికి మాత్ర‌మే సీటు ఇస్తాన‌ని ఖ‌రాకండీగా చెప్పారంట బాబు. మ‌రో రికి కడప ఎంపీ సీటు ఇస్తాన‌ని ఆఫ‌ర్ చేశారంట‌. అయితే జ‌మ్మ‌ల‌మ‌డుగు సీటును వ‌దులు కొనేందుకు ఇద్ద‌రు నేత‌లు సిద్దంగా లేరంట‌. దీంతో అస‌హ‌నం వ్య‌క్తం చేసిన బాబు త్వ‌ర‌గా ఏదొక‌టి తేల్చుకోవాల‌ని వార్నింగ్ ఇచ్చారంట‌.

జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్, పార్టీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌లు రంగంలోకి దిగి ఇద్ద‌రు నేత‌ల‌తో చ‌ర్చించినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో… ఇద్దరూ కూడ ఏకాభిప్రాయానికి రావాలని బాబు సూచించారు. ఏకాభిప్రాయానికి రాకపోతే తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని బాబు హెచ్చరించారు.

అయితే కడ‌ప ఎంపీగా పోటీ చేయ‌డానికి ఇద్ద‌రు నేత‌లు బ‌య‌ప‌డుతున్నారు. అక్క‌డ గెల‌చే ప‌రిస్థితి టీడీపీకీ దాద‌పు శూన్యం. అక్క‌డ గెలుపోట‌ములు నిర్న‌యించేది మైనారిటీ ఓట‌ర్లు. మొద‌టి నుంచి మైనారిటీ ఓట్ల‌న్నీ వైసీపీ వైపే ఉన్నాయి. జమ్మలమడుగు నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై రెండు మూడు రోజుల్లోగా స్పష్టత వ‌స్తుంద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే చివ‌ర‌కు టీడీపీలో కొన‌సాగ‌దెవ‌రో తేల‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -