Friday, March 29, 2024
- Advertisement -

ఉన్నదీ పోయే, ఉంచుకున్నదీ పోయే అంటే ఇదే బాబూ !!

- Advertisement -

కడప జిల్లా జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. వైసీపీ తరపున MLA గా గెలిచిన ఆదినారాయణరెడ్డిని తీసుకొని మంత్రి పదవి ఇచ్చి 25 సంవత్సరాలుగా పార్టీలో ఉన్న మాజీ MLA రామసుబ్బారెడ్డి నోట్లో బాబు మట్టి కొట్టాడు. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరితే… టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ రామసుబ్బారెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గిరి పార్టీలో చేరారు. మొత్తంగా కడప జిల్లాలో టీడీపీ ఖాళీ…!!

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని, ప్రతి కార్యకర్త నిర్ణయం మేరకు మనస్ఫూర్తిగా వైయస్‌ఆర్‌ సీపీలో చేరానని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ నేతలు అంటున్నట్లుగా.. ఎవరో భయపెడితేనో.. ఇంకెవరికో భయపడో.. వైయస్‌ఆర్‌ సీపీలో చేరలేదని, కార్యకర్తలందరితో సమావేశమైన తరువాత స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా వైయస్‌ఆర్‌ సీపీలో చేరానని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో జాయిన్‌ అయిన అనంతరం రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తమ కుటుంబం ఆ పార్టీ కోసం పనిచేసిందని, చిన్నాన్న పొన్నపరెడ్డి శివారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తుచేశారు. తాను కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశానని చెప్పారు. దశాబ్దాల పాటు రాజకీయంగా టీడీపీలో ఉంటూ ఆ పార్టీ కోసం ఎన్ని కష్టాలు అయినా ఎదుర్కొన్నామని వివరించారు.

సీఎం వైయస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలకు, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిని కావాలని వైయస్‌ఆర్‌ సీపీలో చేరానని రామసుబ్బారెడ్డి అన్నారు. జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం, విప్లవాత్మక నిర్ణయాలు, ప్రతి గడపకు ప్రతి సంక్షేమ పథకం అందిస్తున్నారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో నిలిచిపోయే కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. ధైర్యంగా ముందుకెళ్తున్నారన్నారు. కమిట్‌మెంట్‌తో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వైయస్‌ఆర్‌ సీపీ స్వీప్‌ చేస్తుందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -