Friday, March 29, 2024
- Advertisement -

రాజకీయ నటన బంద్.. ఇక సినిమాల్లో నటించనున్న పవన్

- Advertisement -

పవన్ కళ్యాన్ ఓ వైపు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు సినిమాల్లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవలే లాంగ్ మార్చ్ అంటూ పవన్ విశాఖలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. పవన్ వైఖరి చూస్తే అస్సలు సినిమాల్లోకి రారేమో అన్నట్టుంది.

అయితే పవన్ రాజకీయ వేడి రగిలిస్తున్న తెరవెనుక మాత్రం ఆయన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండడం విశేషం. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే చాలు సినిమాను శరవేగంగా పూర్తి చేయడానికి వీలుగా అంతా రంగం సిద్ధం అవుతోంది.

పవన్ కళ్యాణ్ తాజాగా హిందీలో హిట్ అయిన ‘పింక్’ మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. దీనికి పవన్ కూడా ఒప్పుకున్నట్టు తెలిసింది. హిందీలో తీసిన నిర్మాత బోనీ కపూర్, తెలుగు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే పవన్ మూడు ఎప్పుడైనా మారవచ్చని దిల్ రాజు కంగారు పడుతున్నట్టు తెలిసింది. అందుకే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏడు ఎకరాలను లీజుకు తీసుకొని అక్కడ కోర్టు సెట్ ను శరవేగంగా నిర్మిస్తున్నాడట.. పవన్ రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడో.. ఎప్పుడు సినిమాలు వద్దంటాడో అన్న భయంతో దిల్ రాజు ఈ కోర్టు సెట్ ను పరుగులు పెట్టిస్తున్నాడట..

రాజకీయాల్లో జగన్ టార్గెట్ గా చంద్రబాబు పోత్సాహంతో బాగా నటిస్తున్న పవన్ ఇప్పుడు తెరపై కూడా నటించడానికి రెడీ అవుతున్నారు. రాజకీయాల్లో నటించినా ప్రజలు ఆదరించలేదు. మరి సినిమాల్లోనైనా ఆయన నటనను ప్రేక్షకులు ఆదరిస్తారేమో చూడాలి మరీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -