వైసీపీపై ప‌రోక్షంగా సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ …

509
Janasena Chief Pawan Kalyan Hot Comments on YSRCP
Janasena Chief Pawan Kalyan Hot Comments on YSRCP

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌కొద్దీ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ప్ర‌ధానంగా పొత్తుల‌పైనే ఇప్పుడు హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ, జ‌న‌సేన‌, టీడీపీలు ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. మ‌రో వైపు టీడీపీ ఇంకా ప‌వ‌న్ పొత్తుకోసం వెంప‌ర్లాడుతోంది. అయితే ప‌వ‌న్ పొత్తుల‌విష‌యంలో ప‌రోక్షంగా వైసీపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో మాతో పొత్తు పెట్టుకొనేందుకు ర‌క‌ర‌కాల మార్గాల్లో ప్ర‌య‌త్నిస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జనసేనకు సీట్లు రావంటూనే మనతో పొత్తు కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. పొత్తుల కోసం కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలవారీగా నేతలతో సమీక్షలు జరుపుతున్న పవన్.. కృష్ణా జిల్లా నేతలతో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ అంతటా జనసేన బలంగా ఉందని , అందుకే మనతో పొత్తు కోసం వేరే వారితో ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ వెల్లడించారు. గ‌త ఎన్నిక‌ల్లో బాబుకు అనుభం ఉంద‌న్న కార‌ణంగానే మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని తెలిన ప‌వ‌న్‌….ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా దోపిడికీ పరిమితమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.