Tuesday, March 19, 2024
- Advertisement -

అత్యంత గడ్డు పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్.. ఏం చేయబోతున్నారు?

- Advertisement -

సినిమాల్లో పనిచేసిన పంచ్ డైలాగులు.. రాజకీయాల్లో పనిచేయలేదు.. ప్రజారాజ్యం మానని గాయంలా సలుపుతున్నా జనసేనతో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి ఆయన చేసిన రాజకీయం ఫలించింది. 2019లో ఒంటరిగా వెళ్లి పవన్ విఫలమయ్యారు.

అయితే ఇప్పుడు కమలదళంతో కలిసి పవన్ సాగుతున్నారు. తాజాగా ఏపీలో అధికారంలో ఉండి అఖండ మెజార్టీ సాధించిన వైసీపీ కేంద్రంతో అవసరం దృష్ట్యా బీజేపీకి దగ్గరవుతోంది. ఒకవేళ సీఎం జగన్ ఎన్డీఏలోకి అడుగుపెట్టిన క్షణమే.. పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి బయటపడడం తప్ప మరో మార్గం లేదు.

దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఏ లైన్ తీసుకోవాలో తెలియక మథనపడుతున్నారు. బీజేపీ-వైసీపీ కలిస్తే పవన్ బయటకు వస్తారు. కానీ ఒంటరిగా జనసేనాని ఏపీలో సత్తా చాటే అవకాశాలు అయితే లేవు. దీంతో రాజకీయంగా మనుగడ జనసేనకు కష్టమవుతుంది. లాంగ్ టర్మ్ పాలిటిక్స్ అన్న పవన్ కళ్యాణ్ ఆశలు నెరవేరే సూచనలు ఉండవు.

ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గానే ముందుకెళ్తున్నారు. జగన్ పై పరుష పదజాలంతో తిడుతున్నాడు. ఓరోజు ఉత్తరాంధ్ర, రాయలసీమ గురించి.. మరోరోజు అమరావతి రైతుల గురించి పోరాడుతున్నారు. ఇలా పూర్తి గందరగోళంగా పవన్ కళ్యాణ్ పరిస్థితి తయారైందట.. రాజకీయంగా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటన్న పవన్ మున్ముందు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -