Friday, April 19, 2024
- Advertisement -

పవన్ కు ఇప్పటికైనా తానెందుకు ఓడానో అర్థమైంది

- Advertisement -

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని ఘోరంగా ఓడిపోయారు.. రెండు చోట్ల పోటీచేసినా.. స్టార్ ఇమేజ్ ఉన్నా నీట్ పాలిటిక్స్ అంటూ హల్ చల్ చేసినా గెలవలేదు. చంద్రబాబుతో దోస్తీ కట్టి వైసీపీ అధినేత జగన్ ను విమర్శించడం వల్లే ఓడిపోయారని కొందరనున్నారు.. తెరవెనుక బాబు దోస్తీనే ముంచిందన్నారు.

ఇక జనసేనాని కూడా తనకు డబ్బు లేకపోవడం వల్లే.. ఖర్చు పెట్టలేక ఓడిపోయానని ఎన్నికల అనంతరం చెప్పుకొచ్చాడు. ఇక జనసేన పార్టీలో ఏపీలో క్షేత్ర స్థాయిలో బలంగా లేదని.. బలాన్ని పెంచుకోవడానికి తాజాగా జిల్లాల బాట పట్టారు పవన్. అయితే ఇప్పటికీ తన పార్టీ ఓటమికి గల కారణాలను జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు.

పవన్ కు అభిమానులే బలం బలగం.. ఇప్పుడు వారే మైనస్ అవుతున్నారు. అవును నిజమే పవన్ ను అభిమానులే ఓడించారట. వారి అత్యుత్సాహమే జనసేనను ఇంత దాకా తెచ్చిందట.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. స్వయంగా జనసేన అధిపతి పవనే..

తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతు సదస్సుకు పవన్ ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు. రైతుల సమస్యలపై ఎమోషనల్ గా ఆవేదనతో మాట్లాడుతున్న పవన్ కు కార్యకర్తలు, అభిమానులు అడ్డుతగులుతున్నారు. ఈలలు, గోలలు అత్యుత్సాహంతో పవన్ ను మాట్లాడనీయలేదు. దీంతో సహనం కోల్పోయిన పవన్.. మీరిలా క్రమశిక్షన లేకపోవడం వల్లే మనం ఓడిపోయాం.. క్రమ శిక్షణ ఉండుంటే జనసేన గెలిచి ఉండేది అంటూ అభిమానులపై ఫైర్ అవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -