Thursday, April 25, 2024
- Advertisement -

ఉనికి కోసం జనసేన ఉబలాటం

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక రోజు ప్రజల్లోకి వస్తే ఆరు నెలలు కనపడకుండా పోతారనే విమర్శలు ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి కూడా అదే మాట ఇప్పటికే అన్నారు. మనం నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే, ఆరు నెలలకోసారి కనిపించే పవన్ కళ్యాణ్ ఏదేదో మాట్లాడుతారు. మన ఖర్మ ఏంటంటే…అలాంటి వారికి సమాధానం చెప్పాల్సి రావడం అని, ఒక్క ముక్కలో పవన్ గురించి తేల్చి పారేశారు జగన్. ఆయన మాటలు నిజమే కదా అని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు, ప్రజలు కూడా పవన్ రాజకీయాలను ఎద్దేవా చేస్తున్నారు. అప్పుడెప్పుడో శ్రీరెడ్డి కామెంట్లపై నిరసనలు, హెచ్చరికలు జారీ చేసేసిన పవన్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఆ తర్వాత కంటి ఆపరేషన్ పేరుతో ఆయన ప్రజాసేవకు దూరమయ్యారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే నిన్నటి వరకూ ఏడి ? పవన్ కళ్యాణ్ ఎక్కడ ? ఏం చేస్తున్నాడు ? ఏమైపోయాడు ? ఆయన చేస్తున్న పెజా సేవ ఎంతవరకూ వచ్చింది ? అని ప్రశ్నలు మొదలయ్యాయి. పవన్ సార్ రాజకీయాల్లో ఉన్నారా ? ఉంటే ఉలుకూ పలుకూ లేదెందుకు ? ఓ సారి వచ్చి ఏదో ఓ అంశం మీద ఊగిపోతూ ఉపన్యాసమిచ్చేస్తే చాలు కదా..! అదే పదివేలు అనుకుని ఓ ఆర్నెల్లు బతికేస్తాం. ఆ తర్వాత ఎన్నికల టైంలో మరోసారి వచ్చి మోడికి జై కొట్టేస్తే చాలు కదా…! పవన్ పూర్తిస్థాయి పెజాసేవ చేసుకున్నట్టే కదా…! అని ఆయన అభిమానులతో పాటు జనసేనలో ఎందరున్నారో తెలియదు కానీ, వారిలో కొందరు మాత్రం ఇలాగే కోరుకున్నారు.

పార్టీ శ్రేణులు, అభిమానుల ఆత్మఘోష వినిపించిందో..! లేక చాలా రోజులైపోయింది పెజాసేవ చేసుకుని, మరోసారి చేసుకుందామని అనిపించిందో…! కానీ పవన్ సార్ మళ్లీ ప్రజల్లోకి వచ్చేద్దామని నిర్ణయించుకున్నారు. వెంటనే ఈ నెల 25న ముహూర్తం కూడా పెట్టేశారు. అయితే ఈ సారి ఎక్కడ అడుగు పెట్టాలి ? ఏ వర్గాన్ని రెచ్చగొట్టాలి ? ఏ ప్రాంతలో మన పార్టీకి కొంచెం గుర్తింపు దక్కుతుంది ? ఏ అంశంపై ఊగిపోతూ ఉపన్యాసమిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు ? అని ఆలోచించీ చించీ..పవన్ సార్ ఈ సారి పశ్చిమగోదావరి జిల్లాపై మనసు పడ్డారు. ఆ జిల్లాలో ఇప్పటికిప్పుడు వచ్చి పడిపోయిన పెద్ద పెద్ద కష్టాలు ఏమీ లేవు. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ మీడియాలోని వార్తలు చూసుకుంటూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ జనం బిజీగా ఉన్నారు. మరి ఏ సమస్యను గుర్తు చేయాలని ఆలోచించిన జనసేనానికి వెంటనే పోలవరం గుర్తుకొచ్చేసింది. ఈ మధ్యే 60 శాతం వరకూ పనులు పూర్తి చేసుకుని, చక చకా వెళ్తున్న ఆ ప్రాజెక్టు మీద ఆ మధ్య పవన్ సార్ వేసిన నిజ నిర్ధారణ కమిటీ కూడా పర్యటించేసి వచ్చేసింది. ఇప్పుడు పవన్ కూడా ఆ ప్రొజెక్ట్ ను ఓ సారి సందర్శించేసి, అక్కడి ప్రజలను కావాలనే, కెలికి, రెచ్చగొట్టేసి, మీ తరఫున పోరాటం చేసేస్తాను. అని చంద్రబాబుని విమర్శించేసి, నిధులు ఇవ్వని మోడీని పల్లెత్తు కూడా మాట అనకుండా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కనుక బాల్య స్మృతులు కూడా ఓ సారి నెమరేసుకున్నట్టు ఉంటుంది. అని వెంటనే మళ్లీ పెజాసేవకు ఈ నెల 25న మూహూర్తం కూడా పెట్టేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తారో…మళ్లీ ఎన్నాళ్లకు పెజాసేవను గుర్తు చేసుకుంటారో…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -