Friday, March 29, 2024
- Advertisement -

సీట్ల స‌ర్దుబాట్ల‌పై వామ ప‌క్షాల‌తో జ‌న‌సేన చ‌ర్చలు…

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ దూకుడు పెంచారు. ఈ ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్ష పార్టీల‌తో త‌ప్ప వేరే పార్టీల‌తో పొత్తు పెట్టుకోమ‌ని తేల్చిచెప్పారు. ఆ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు వేస్తున్నారు. వైసీపీ, టీడీపీల‌కు షాక్ ఇచ్చే విధంగా పావులు క‌దుపుతున్నారు. టీడీపీతో గాని, వైసీపీతో గాని జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటుంద‌న్న వార్త‌ల‌కు తెర‌దించిన సంగ‌తి తెలిసిందే.

సీట్లు స‌ర్దుబాటు విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేందుకు వామ‌ప‌క్ష పార్టీల‌లు జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో నాదెండ్ల మ‌నోహ‌ర్ తో స‌మావేశ‌మ‌య్యారు. ఎన్నికల్లో పోటీకి దింపాల్సిన అభ్యర్థుల జాబితాపై వారి మధ్య గంటపాటు చర్చ జరిగిన‌ట్లు స‌మాచారం. ఎక్కడెక్కడ ఏ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలన్నదానిపై ఇరు పక్షాల మధ్య ప్రాథమికంగా ఓ అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.

మొత్తం 175 నియోజకవర్గాల్లో జనసేన, వామపక్షాల నేతలు పోటీ చేయడం, అలాగే ఆయా నియెజక వర్గాల్లో కేడర్‌ను పెంచుకో్వడం తదితర అంశాలపై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. చర్చలు ముగిసిన అనంతరం ఇరు పార్టీల నేతలు పవన్ కల్యాణ్ నివాసానికి బయలుదేరి వెళ్లారు.

మ‌రో వైపు ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొస్తున్న త‌రుణంలో అభ్య‌ర్తుల ఎంపిక , పొత్తు, ప్ర‌క‌ట‌న ఆల‌స్యం అయితే పార్టీకీ న‌ష్టం క‌లుగుతుంద‌ని ఆ దిశ‌గా ప‌వ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. వామ‌ప‌క్ష నేత‌లు సైతం అదే భావ‌న‌లో ఉన్నారు. త్వరగా పొత్తులు, సీట్ల సర్దుబాటు చేసుకోవడం ద్వారా…. తొందరగా ప్రజల్లోకి వెళ్లడానికి వీలు కలుగుతుందని నేతలంతా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. సంక్రాంతి త‌ర్వాత ఇరు పార్టీలు ఒక అవ‌గాహ‌న‌కు రావ‌చ్చ‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -