Friday, April 19, 2024
- Advertisement -

తెలంగాణలో రేపు ఏమేమి బంద్ చేశారో తెలుసా ?

- Advertisement -

కరోనా కట్టడి చేసేందుకు అన్ని విధాలకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ సీఎం కేసిఆర్ చెప్పారు. కరోనా విజృంభించే పరిస్థితి వస్తే పూర్తిగా షట్ డౌన్ చేయడానికి అసలు వెనకడానని సీఎం అన్నారు. ప్రతి ఇంట్లోనే ఉండాలని.. ప్రభుత్వమే వారికి అవసరమైన నిత్యావసరాలను అందించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మహారాష్ట్ర సరిహద్దులను కూడా మూసేస్తామని అన్నారు.

కరోనాను కట్టడి చేసేందుకు రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నామని అన్నారు. పరిస్థితి తీవ్రత కారణంగా తాము మీడియా సమావేశంలో విలేకరులను కూడా మూడు మీటర్ల ఎడంతో కూర్చోబెట్టామని, అందరి క్షేమం దృష్ట్యా ఇలాంటి చర్యలు తప్పడంలేదని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారని, ఆయన 14 గంటలు పాటిద్దాం అని చెప్పారని, కానీ తెలంగాణ వాసులు రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటించి సామాజిక బాధ్యతను చాటాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని… దేన్నైనా ముట్టుకున్న తర్వాత ముఖాన్ని టచ్ చేయవద్దని సూచించారు. చర్మం ద్వారా కరోనా మన శరీరంలోకి ప్రవేశించదని… ముఖం ద్వారానే శరీరంలోకి వెళ్తుందని కాబట్టి పరిశుభ్రంగా ఉండాలని అన్నారు.

రేపు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడవవని చెప్పారు. షాప్స్, మాల్స్ అన్నీ స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. ఇది తమ ఆదేశం కాదని… ఎవరికి వారు నిర్ణయం తీసుకుని మూసివేయాలని చెప్పారు. నిత్యావసరాలు, చేపలు, పండ్లు, కాయగూరలు అమ్ముకునే వారిపట్ల ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఇతర అత్యవసర సేవలన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరం ముందుకు రావాలని చెప్పారు. తెలంగాణను కరోనా ఏమీ చేయలేపోయిందనే గొప్ప పేరును తెచ్చుకుందామని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -