వైఎస్ జ‌గ‌న్ దెబ్బ‌కు దిగొచ్చిన టీడీపీ ప్ర‌భుత్వం…

636
Janma Bhumi : Chandrababu Naidu Announces Double The Pensions
Janma Bhumi : Chandrababu Naidu Announces Double The Pensions

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర దెబ్బ‌కు బాబు మైండ్ బ్లాక్ అయ్యింది. వైసీపీ న‌వ‌ర‌త్నాల ప‌ధ‌కాల‌కు ప్ర‌భుత్వం దిగొచ్చింది. పార్టీ అధికారంలోకి రాగానే విక‌లాంగుల‌కు ఫించ‌న్ రూ. 3000,వృద్దులకు, వితంతువుల‌కు పింఛ‌న్‌ల‌ను రూ.2000 ఇస్తామ‌ని పాద‌యాత్ర‌లో ప్ర‌క‌టించారు జ‌గ‌న్‌. దీంతో బాబుమ‌రో డ్రామాకు తెర‌లేపారు. నాలుగేళ్లపాటు పెన్షన్ల అంశాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించని చంద్రబాబు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేల ఇప్పుడున్న పెన్షన్లను రెట్టింపు చేశారు బాబు. శుక్రవారం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆకస్మాత్తుగా పింఛన్ల పెంపు ప్రకటన చేశారు.

పాద‌యాత్ర‌లో వృద్దులకు 2వేలు, వికలాంగులకు 3 వేల రూపాయల పింఛన్ ప‌ధ‌కాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెల్లారు జ‌గ‌న్‌. మరో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఫించన్ల పెంపు నిర్ణయం డ్రామాలో భాగంగానే పలువురు అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనా జ‌గ‌న్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగింద‌నే చెప్పాలి.