జగన్ పై మళ్లీ విమర్శలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి

484
jc diwakar reddy fires on jagan
jc diwakar reddy fires on jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మా వాడు అంటూనే తనదైన శైలిలో విమర్శలు చేశాడు. జగన్ తప్పులు చేస్తున్నారంటూ టార్గెట్ చేసి మాట్లాడారు. అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు దీక్ష చేస్తున్నప్పటికి జగన్ పట్టిందుకోవడం లేదని.. కనీసం మీ సమస్య ఏంటి అని కూడా అడగటం లేదని చెప్పారు.

కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోవడం లేదని… హైకోర్టునే పీకేశాడని చెప్పారు. జగన్ ను చూసిన అందరూ వణుకుతారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ వాళ్లపై దాడులు జరుగుతున్నాయని.. ఇక్కడ రాక్షస రాజ్యం ఉందని.. మొత్తం వైసీపీ చెప్పినట్లే జరుగుతుందని.. వాళ్ల పాలనలో ఏం ఆశించలేమని జేసీ అన్నారు. ఇక టీడీపీ వాళ్లు ఎందుకు దీక్షలు చేస్తున్నారో అర్దం కావడం లేదని అన్నారు. దీక్షలు చేసినంత మాత్రాన జగన్ లో మార్పు రాదని చెప్పారు.

నిరాహార దీక్ష చేసినా జనాలు నమ్మే స్థితిలో లేరని… బిర్యానీ తిని దీక్షలో కూర్చున్నారని అనుకుంటారని తెలిపారు. రాష్ట్రంలోని సగం జనాలు ఆయన ఇంటి ముందు కూర్చుంటే జగన్ వింటాడేమో అని జేసీ అన్నారు. ఇక పొతిరెడ్డిపాడు విషయంలో జగన్ సిన్సియర్ గా ఉన్నట్లు కనిపిస్తోందని జేసీ చెప్పారు.

Loading...