Tuesday, April 23, 2024
- Advertisement -

అనంతపురంలో జేసీ కొడుకు , ప‌రిటాల‌లో శ్రీరామ్ వెనుకంజ‌..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులు, ఓటర్ల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎప్పుడో 40 రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఫ‌లితాల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకు పోయింది. టీడీపీ త‌రుపు త‌మ వార‌సుల‌ను బ‌రిలోకి దింపిన మంత్రుల‌కు షాక్ తుగులోంది. అనంత‌పురం నుంచి టీడీపీ త‌రుపున జేసీ కొడుకు ప‌వ‌న్ ఎంపీగా పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఫ‌లితాల్లో మాత్రం జేసీ వ‌ప‌న్ వెనుకంజ‌లో ఉన్నారు. కడపలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, హిందూపురం లోక్‌సభ స్థానంలో గోరంట్ల మాధవ్‌ ఆధిక్యంలో ఉన్నారు

అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అనంతపురం అర్బన్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి అనంతవెంకట్రామిరెడ్డి 1000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అనంతపురం: ఉరవకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -