Friday, April 19, 2024
- Advertisement -

బట్టలు లేకుండా నిలబెట్టాడు.. నన్ను అరెస్ట్ చేయొచ్చు : జేసీ

- Advertisement -

జేసీ ప్రభాకర్రెడ్డి అరెస్ట్ పై మాజీ ఎంపీ దివాకర్రెడ్డి స్పందించారు. ప్రభాకర్రెడ్డి పై ఆరోపణలు వాస్తవేమనని.. అయితే అస్మిత్ రెడ్డికి ఏ తెలియదని అన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. నేరం చేయకున్నా వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయగలదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టే చంద్రబాబు, లోకేషన్ ను అరెస్ట్ చేయడం లేదని జేసీ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు జోలికి వైసీపీ ప్రభుత్వం వెళ్తే రాష్ట్రం అల్లకల్లలోం అవుతుందని.. చంద్రబాబు వెంట ఉన్నవారిని అరెస్ట్ చేసి భయపెట్టాలన్నది ప్రభుత్వం ఉద్దేశమని జేసీ అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏసు ప్రభు చెప్పిన వినే పరిస్థితిలో లేదని.. ఎంతకైన తెగించడానికి రెడీగా ఉన్నారని అన్నారు. జగన్ ను కంట్రోల్ లో పెట్టడం ప్రధాని నరేంద్రమోదీ తోనే సాధ్యమవుతుందన్నారు. తమ్ముడి అరెస్టు పై తాను ఏమీ మాట్లాడబోనన్నారు.

అరెస్టుకు నిరసనగా ఎలాంటి కార్యక్రమ ప్రణాళిక లేదన్నారు. “నేను నిజం చెబుతున్నా.. నాకు ఎన్ని లారీలు, బస్సులు ఉన్నాయో నాకే తెలియదు. మీరు నమ్మిన నమ్మకపోయిన పోయేది ఏం లేదు. ఈ ప్రభుత్వం ఎందుకైన తెగిస్తోంది. రూల్స్ అనేవి ఇక్కడ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేం. కోర్టుకు వెళ్లాల్సిందే. జగన్ సర్వశక్తి సంప్పన్నడు. ఆయనే అల్లా ఆయనే ఏసు ఆయనే తిరుపతి వెంక్కన. తన మాటకు ఎదురు చెప్పేవాడు తనకు ప్రతి పక్షంలో ఎవరు లేకుండా చేయడమే తన ధేయం అన్నట్లుగా ఉంది జగన్ పాలన. జగన్ దగ్గర మంచి అధికారులు ఉన్నా వారు ఏం చేయలేని పరిస్థితి. ఎమ్మెల్యేలు మంత్రుల మాట కూడా వినే పరిస్థితిలో జగన్ లేడు. నన్ను నడిరోడ్డులో బట్టలు లేకుండా నిలబెట్టాడు.. నా ఆర్థిక మూలాలు లేకుండా చేశాడు. నన్ను అరెస్ట్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.’’ అంటూ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కారు ఎక్కిన విజయసాయిరెడ్డిని దింపేసి జగన్.. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం..!

పాతికేళ్లుగా ఎవరు చేయలేని సాహసం చేసిన సీఎం జగన్..!

చంద్రబాబూ..నీవు మనిషివా?.. దున్నపోతువా?

జగన్ పాలనపై జేడీ లక్ష్మీనారాయణ షాకింగ్ కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -