Friday, April 19, 2024
- Advertisement -

జేడీ లక్ష్మీనారయణ వైసీపీలో చేరబోతున్నారా ?

- Advertisement -

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో చెప్పలేం. శత్రువులు స్నేహితులు అవుతే.. స్నేహితులు శత్రువులు అవుతారు. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా 10 ఏళ్ల పాటు పోరాడారు. అధికార పక్షాల కుట్రలకు 16 నెలల జైలుకు వెళ్లారు. జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణను ప్రముఖ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ చేశారు. తర్వాత ఆయన ఉద్యోగంకు రిజైన్ చేసి పాలిటిక్స్ లోకి అడుగు వేశారు. గత ఎన్నికల సమయంలో జనసేనలో చేరిన ఆయన ఇటీవలై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.

బీజీపీలో చేరుదాం అనుకున్నారు. కానీ జనసేన పార్టీ బీజీపీతో పొత్తులో ఉండటంతో వెనకడుగు వేశారు. అయితే తాజాగా జేడీ అడుగులు వైసీపీ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కరోనాపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యాలకు మద్దతు తెలిపిన జేడీ తాజాగా సీఎం జగన్ ఏడాది పాలనపై ప్రశంసలు కురిపించడం విశేషం. ఈ క్రమంలోనే జేడీ వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ ను జైలుకు పంపిన జేడీని జగన్ ఆహ్వానిస్తాడా అన్న అనుమానం అందరిలో కలుగుతోంది.

దీనికి జేడీ కూడా ఆసక్తికరంగా స్పందించాడు. జగన్ పై కేసులు రాజకీయ కక్షతో పెట్టారని.. విధి నిర్వహణలో భాగంగానే తాను ఆ కేసులను విచారణ జరిపానని జేడీ పరోక్షంగా అన్నారు. అయితే జేడీ వైసీపీలోకి వస్తాను అంటే జగన్ చేర్చుకుంటాడనే వాదన వినిపిస్తోంది. విచారణ జరిపిన జేడీయే చేరితే జగన్ కేసులు కుట్ర అని ప్రజలకు తెలుస్తుందని.. జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్టు అవుతుందని వైసీపీ ఆలోచిస్తోంది. మరి జేడీకి జగన్ అవకాశం ఇస్తారా అన్నది ఇప్పుడు రాజకీయా వర్గాల్లో ఆసక్తిగా మారింది.

జగన్ న్యూ ప్లాన్.. టీడీపీకి ఎన్టీఆర్ పేరుతో చెక్..!

పార్క్ హయత్ రహస్య భేటీ కుట్ర కోసమే : అంబటి రాంబాబు

బిగ్ బ్రేకింగ్ : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

రోజాకి మంత్రి పదవి.. అనిల్ కి డిప్యూటీ సీఎం.. ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -