Friday, April 26, 2024
- Advertisement -

జగన్ పాలనపై జేడీ లక్ష్మీనారాయణ షాకింగ్ కామెంట్స్

- Advertisement -

అవినీతి ఆరోపణలు అని.. వాటిపై సీబీఐ అధికారిగా ఉన్న వ్యక్తి విచారణలో భాగంగా జైలుకు వెళ్లేలా చేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వెళ్లిన వేదిక సక్రమమైనదని గుర్తించి బయటకు వచ్చాడు. ఈ సమయంలో అతడు ఎవరిపైనైతే విచారణ చేసి.. జైలుకు పంపించిన వ్యక్తిని మెచ్చుకుంటున్నాడు. అతడి పాలన భేష్ అని జేజేలు పలుకుతున్నాడు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

ప్రస్తుత పరిణామాలపై తాజాగా జేడీ లక్ష్మీనారాయణ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగన్ ఏడాది పాలనపై స్పందించి ఆయనకు త్వరలోనే మార్కులు ఇస్తానని చెప్పారు. ఏపీ ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంటుందని.. కొందరు మేనిఫెస్టోను కేవలం గెలుపు కోసమే ఉపయోగిస్తారు. అందులో చెప్పినవ్వి చేయరు. కానీ జగన్ మేనిఫెస్టోలో ఉన్న విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశంసించారు. ఈ విధంగా జగన్ పాలనను కీర్తించారు. జగన్ అక్రమాస్తుల కేసుపై విచారించిన దానిపై కూడా స్పందించి మాట్లాడారు.

విచారణ తర్వాత తాను జగన్ విమానాశ్రయంలో ఎదురుపడ్డామని.. ‘నమస్కారం అంటే నమస్కారం’ అని పలకరించుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. అయితే జేడీగా ఉన్నప్పుడు తన డ్యూటీ తాను నిర్వహించానని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా ద్వేషం కక్ష లేదని చెప్పారు. ప్రస్తుతం తాను ఇప్పుడు ఫుల్ టైమ్ రాజకీయాలు చేయడానికి వచ్చానని తెలిపారు. అయితే తాను వెళ్లిన జనసేన పార్టీలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్లో రాజకీయ పరిపక్వత కనిపించ లేదని వెల్లడించారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని లక్ష్మీనారాయణ వివరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -