Wednesday, April 24, 2024
- Advertisement -

కుమార‌స్వామికి సీఎం ప‌ద‌వి ముళ్ల‌బాటేనా…?

- Advertisement -

క‌ర్నాట‌క సిల్లీ రాజ‌కీ ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌న‌కు ముందే సీఎం ప‌ద‌వికి య‌డ్యూర‌ప్ప రాజీనామా చేశారు. కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో జేడీఎస్ కుమార స్వామి క‌ర్నాట‌క సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం ఇక లాంఛ‌న‌మే. అస‌లు విష‌యానికి వ‌స్తే త్వ‌ర‌లో క‌ర్నాట‌క‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న రానుందా…..? అలాంటి అవ‌కాశాలు లేక‌పోలేదు..

కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో జేడీఎస్ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప‌డిపేది క‌ష్ట‌మేన‌ని చెప్ప‌వ‌చ్చు. సీఎం కుర్చీలో కుమార‌స్వామిని కూర్చొపెడితే ఇక మంత్రి ప‌ద‌వుల పందారం ఇరు పార్టీల‌కు క‌త్తిమీద సాములాంటిదే. కూట‌మినుంచి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు మంత్రి ప‌ద‌వులు ఆశ చూపెట్టి జంపింగ్‌ల‌కు అడ్డుక‌ట్ట‌వేశారు. మంత్రుల పదవుల కోసం ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.

సౌత్‌లో భాజాపా పాగా వేయ‌కుండా అడ్డుకొనేందుకె కాంగ్రెస్ జేడీఎస్ క‌లిసుందే త‌ప్ప ఆ పార్టీపై ప్ర‌మేతో కాద‌నేది అంద‌రికి తెలిసిందే. కానీ.. కుమారస్వామి సీట్లో కూర్చుని.. మంత్రి వర్గం ఏర్పాటు చేస్తే అప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఇప్పటికే అక్కడ డిప్యూటీ సీఎం హోదా ఆశావహులు చాలా మంది కనిపిస్తున్నారు.

కూట‌మినుంచి ఎమ్మెల్యేలు చేజారకుండా ప్ర‌ముఖ పాత్ర పోషించారు డీకే శివకుమార . అలాంటి వాళ్లు డిప్యూటీ సీఎం ప‌ద‌విపై ఆశ‌లు చాల‌నే ఉంటాయి. ఇక సీఎంగా ప‌నిచేసిన సిద్ధారామ‌య్య‌కూడా డిప్యూటీ సీఎం ప‌ద‌విపై క‌న్నేసింటారు.

భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం 104మంది సభ్యుల బలముంది. రెండు స్థానాల్లో ఇంకా ఎన్నికలు జరగాలి. ఆ రెండు స్థానాలు భాజాపా గెలుచుకుంటే మ‌రో రెండు స్థానాలబ‌లం పెరుగుతుంది. కుమారస్వామి పరిపాలన మొదలైన తర్వాత.. ఆయన జంబో క్యాబినెట్ ఏర్పాటు చేయగల అవకాశమైతే లేదు. పరిమితిని బట్టి మాత్రమే ఆయన మంత్రి పదవులు పంచగలరు. మిగిలిన అసంతృప్తి వాదులకు కాంట్రాక్టుల ఆశ చూపించాల్సిందే తప్ప మరో మార్గం లేదు. అయితే ఆ పరిస్థితి వచ్చిన తర్వాత.. ఆ రెండు పార్టీల్లోని అసంతృప్తి వాదులను ఆకర్షించడం కమలదళానికి చాలా ఈజీ అయిపోతుంది.

కూట‌మినుంచి భాజాపావైపు ఎమ్మెల్యేలు వ‌స్తే వారిమీద క‌శ్చితంగా అన‌ర్హ‌త వేటుప‌డుతుంది. ఎందుకంటే స్పీక‌ర్‌గా ఇరు పార్టీల‌నుంచి ఎవ‌రో ఒక‌రు ఉంటారు. అంటే ఉప ఎన్నికలు వస్తాయి. లేదా, భాజపా కూడా వ్యూహాత్మకంగా పదవులకు రాజీనామా చేయించి, ఆ పిమ్మట వారిని తమ పార్టీలోకి చేర్చుకోవచ్చు. అదే జరిగితే కుమారస్వామి సర్కారు కుప్ప కూలుతుంది. వెంట‌నే కేంద్రం రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించి మ‌రోసారి ఎన్నిక‌లు జ‌ర‌గుతాయి. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే కుమార‌స్వామి సీఎం ప‌ద‌వి నిద్ర‌లేని రాత్ర‌లే…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -