చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేఏ పాల్‌…

688
KA Paul Hot Comments on AP CM Chandra babu Naiudu
KA Paul Hot Comments on AP CM Chandra babu Naiudu

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు. క్రైస్త‌వ మ‌త ప్ర‌బోధ‌కుడు కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాబు వ‌ల్ల త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని వ్యాఖ్యానించారు. గత నాలుగున్నరేళ్లుగా తనపై ఏడు సార్లు కుట్ర చేశారని ఆరోపించారు.

మ‌రో వైపు బాల‌కృష్ణ‌పై కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘బాలకృష్ణ ఎవరో తెలియదు. ఆయన యాక్టరా? అని అడిగా. యూట్యూబ్‌లో ఆ వీడియోను 14 లక్షల మంది చూశారట కానీ అది నిజం’ అని తెలిపారు. అయితే అదే ఛానల్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడితే మాత్రం 5 నుంచి 10 వేల మంది మాత్రమే చూశారని అన్నారు. దీనిని బట్టి పవన్ కంటే తన ఫాలోయింగ్ 100 రెట్లు ఎక్కువని కేఏ పాల్ స్పష్టం చేశారు.

తన కుట్రలపై చంద్రబాబు నాయుడుకు 82 సార్లు ఫోన్ చేసినట్లు తెలిపారు. హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేసింది బాబుబ కాద‌ని నేన‌ని చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల సమస్య లు ఉన్నాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు రక్షణ లేదని అన్నారు.

Loading...