Thursday, April 18, 2024
- Advertisement -

మంత్రి కాల్వ శ్రీనివాసులకు షాక్… వైకాపాలోకి ముఖ్య అనుచుర నాయకుడు

- Advertisement -

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఫలితాన్ని ప్రభావితం చేసే స్థాయి పరిణామాలు తాజాగా చోటు చేసుకున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్‌పై అర్థంపర్థం లేని విమర్శలతో విరుచుకుపడే నాయకుల్లో ఈ కాల్వ శ్రీనివాసులు కూడా ఒకరు. ఇప్పుడు ఈ మంత్రి వర్యులు కాల్వ శ్రీనివాసులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది వైకాపా. ఇప్పటికే 2019 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు నిర్వహించిన సర్వేలో రాయదుర్గం నియోజకవర్గంలో వైకాపా గెలుపు ఖాయమని తెలిసింది. ఆ వెంటనే కాల్వ శ్రీనివాసులును తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు చంద్రబాబు.

అయితే ఇప్పుడు తాజాగా కాల్వ శ్రీనివాసులు ప్రధాన అనుచర నాయకుడు నారాయణస్వామి చౌదరి వైకాపాలో చేరడం కాల్వను షాక్‌కి గురిచేసి ఉంటుందనడంలో సందేహం లేదు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో వైకాపా కండువా కప్పుకున్నాడు నారాయణ స్వామి చౌదరి. ఆయనతో పాటు మంత్రి అనుచరులైన నాయకులు, వందలాది మంది స్థానిక నాయకులు కూడా వైకాపాలో చేరారు. కాల్వ శ్రీనివాసులు సైకోలో వ్యవహరించారని, కనీసం భరించడం కూడా కష్టమేనని వైకాపాలో చేరిన టిడిపి నేతలు విమర్శలు చేశారు. టిడిపి పాలనలో రాయలసీమ ప్రజలకు…….మరీ ముఖ్యంగా అనంతపురానికి తాగునీళ్ళు కూడా దొరకని దుస్థితి నెలకొందని ఆ నాయకులు విమర్శలు చేశారు. విమర్శల విషయం ఎలా ఉన్నా ఈ నాయకుల చేరికలు మాత్రం 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా రాయదుర్గం నుంచి పోటీ చేయనున్న కాల్వ శ్రీనివాసులు గెలుపును ప్రశ్నార్థకం చేసేవేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -