Thursday, March 28, 2024
- Advertisement -

చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కమల్ హాసన్…

- Advertisement -

టాలీవుడ్ లో దశాబ్దాలుగా నెంబర్ వన్ గా ఉంటున్న చిరంజీవి ఆ పొజిషన్ ను వదిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సినమా అభిమానంతో సీఎం అవుదామని వచ్చిన చిరు సీన్ రివర్స్ అయ్యింది. తరువాత ప్రజారాజ్యం పార్టీ కనుమరుగు అయ్యింది. ఓ విఫల రాజకీయ నాయకుడిగా చిరంజీవి మిగిలిపోయారు. రాజకీయ జీవితంను వదిలిపెట్టిన చిరు మళ్లీ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా సైరా సినిమా ప్రమేషన్ష్ లో భాగంగా ఓ తమిళ పత్రిక వికటన్ కు ఇచ్చిన ఇంటర్వూలో రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో తనకు ఎదురైన పరిస్థుతులను, అనుభవాలను చిరంజీవి చెప్పుకొచ్చారు.

నన్ను, నాతమ్మున్ని రాజకీయాల్లో ప్రజలు ఓడించారని…రజనీకాంత్, కమల్ హాసన్ ల పొలిటికల్ ఎంట్రీపై వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావొద్దనీ..ప్రస్తుత రాజకీయాలు కులం, ధనం ప్రాతిపదికగా నడుస్తున్నాయని… ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు.

అయితే చిరు వ్యాఖ్యలకు కమల్ హాషన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గెలుపోటముల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. సమాజంలో మార్పు కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. చిరంజీవి నాకెప్పుడూ సలహాలు ఇవ్వలేదు. చిరంజీవి అభిప్రాయం ఆయన సొంత విషయం అని చురకలు అంటించారు. ఇటువంటి విషయాల్లో ఎవరి నిర్ణయాలు వారివే అని చెప్పకనే చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రజల ఆలోచన ధోరణిపై అవగాహన పెరిగిందని కమల్ అన్నారు.

చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడానికి ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన చిరంజీవి కేవలం పదేళ్లలో అదే పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. అటువంటి వ్యక్తికి రాజకీయాల్లో ఎదురైన అనుభవాలు బాధాకరమనే చెప్పుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -