Friday, April 19, 2024
- Advertisement -

గవర్నర్ జోక్యం..కర్నాటకానికి ఫుల్ స్టాప్

- Advertisement -

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ వేసిన ఎత్తులు బూమరాంగ్ అయ్యాయి. చేతుల్లోకి వచ్చిన అవకాశాన్ని గవర్నర్ వల్ల బిజెపి కోల్పోయినట్టైంది. కర్ణాటకలో సంకీర్ణ జిడిఎస్- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బిజెపి పెద్ద స్కెచ్ గీసింది. అయితే ఈ వ్యవహారంలో గవర్నర్ వాజుభాయ్ ను పావుగా వాడాలని చూసింది కానీ ఇప్పుడు అదే గవర్నర్ బిజెపి అవకాశాలను తీవ్రంగా దెబ్బ తీశారు.

గవర్నర్ రాసిన ఒక లేఖ ఇప్పుడు కర్ణాటకలోని కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడడం విశేషం. గవర్నర్ లేఖను సాకుగా చూపి కుమారస్వామి, కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. తేలేదాకా బల పరీక్ష వాయిదా వేయడానికి కుమారస్వామి సిద్ధమయ్యారు. దీంతో బిజెపి చేతులారా గవర్నర్ తో దూకుడుగా వ్యవహరించి అధికారాన్ని అందివచ్చిన అవకాశాన్ని కోల్పోయింది.

గవర్నర్ వాజుభాయ్ తాజాగా శుక్రవారం మధ్యాహ్నం 1:30 లోపు బల పరీక్ష నిర్వహించాలని స్పీకర్ సురేష్ కుమార్ కు లేఖ రాశారు. అంతేకాదు సీఎం కుమారస్వామి ని బల పరీక్ష నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించారు. అయితే గవర్నర్ శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కర్ణాటక వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు తమ తీర్పుపై ఉత్తర్వులు ఇచ్చేంత వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.

దీంతో ఇప్పటికే మైనార్టీలో ఉన్న కుమారస్వామి సర్కార్ నెత్తిన గవర్నర్ లేఖ, సుప్రీం స్టేతో పాలు పోసినట్టైంది. కుమారస్వామి బలం నిరూపించుకుంటే ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి. ఇప్పుడు గవర్నర్ లేక వల్ల కుమారస్వామికి సుప్రీంకోర్టు తీర్పు వరంలా మారింది..

ఇదే సమయంలో బిజెపి దగ్గరకు వచ్చిన అధికారాన్ని కుమారస్వామి చేతికి అప్పగించినట్టైంది. గవర్నర్ వాజు భాయ్ చేసిన ఒక తప్పు బీజేపీకి మైనస్ గా మారగా.. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి గట్టెక్కిస్తోంది. ఈ వ్యవహారంలో సుప్రీం తీర్పు వచ్చేవరకు పరిస్థితి ఇలాగే ఉండనుంది.ఈ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మిగతా వారు ఇక బయటకు రావాల్సిందే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -