Saturday, April 20, 2024
- Advertisement -

ఏపీలో అస‌దుద్దీన్‌, కేసీఆర్ వ్యూహం ఇదేనా…?

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారాయి. ఎందుకంటేఎమ్ఐఎమ్‌, టీఆర్ ఎస్‌లు కూడా ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించ‌డంతో మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇక అస‌దుద్దీన్ ఓవైసీ మాత్రం చంద్ర‌బాబుకు ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. వ‌స్తున్నా…..బాబు కాసుకో..నేనేంటో చూపిస్తా…నామిత్రుడు జ‌గ‌న్ త‌రుపున ప్ర‌చారం చేస్తాన‌ని వార్నంగ్ ఇచ్చారు.

ఇప్పుడు అంద‌రి ఆలోచ‌న‌లు అసుద్దీన్ వ్యూహ‌పైనే ఉన్నారు. ఆయ‌న వ్యూహం వెనుక లెక్క‌లేంటి…? మైనారిటీ ఓట్లును వైసీపీకీ వ‌చ్చే విధంగా ఎలాంటి ప్ర‌భావం చూపుతార‌నేది ఇప్పుడు అంద‌రిమెదుల్ల‌లో ఉన్నా ప్ర‌శ్న‌.చంద్రబాబుకు తన సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత ఉందనీ.. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానాలు రెండు కూడా గెలవలేరని ఒవైసీ జోస్యం చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసినా తెలంగాణ లో చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోయారని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు.

ఓవైసీ ఇంత ధైర్యంగా చెప్పడం వెనుక కారణం చూస్తే ఏపీలో మైనార్టీ ఓట్లు కూడా కీలకంగా ఉండటమేనని అంటున్నారు. రాయలసీమలోని కర్నూలు- అనంతపురం- కడపజిల్లాల్లో మైనార్టీ ఓటు బ్యాంకు గెలుపు ఓటములను నిర్దేశిస్తుంది. దీనికి తోడుగా రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు- కృష్ణా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లోనూ మైనార్టీ ఓటు బ్యాంకు బలంగానే ఉంది. ఈ ఓట్ల‌లో ఎన్నో కొన్ని వైసీపీకీ మ‌ళ్లుతే జ‌గ‌న్‌కు బంఫ‌ర్ మెజారిటీ రావ‌డం ఖాయం అన‌డంలో సందేహంలేదు.

ఓ వైపు తమ మిత్రపక్షం అయిన టీఆర్ఎస్ కు రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబును ఎదుర్కోవడం అదే సమయంలో తాము మద్దతిస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి కి అండదండగా ఉండటం ఓవైసీ లక్ష్యమంటున్నారు. అందుకే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా… రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి చంద్రబాబుకు చుక్కలు చూపించడమే లక్ష్యంగా సాగవచ్చంటున్నారు.

ఇక కేసీఆర్ వ్యూమం గురించి ఆలోచిస్తే..అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ముస్లీం మైనారిటీల జనాభా లెక్కలోకి తీసుకునే స్థాయిలో ఉండడమే అందుకు కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు అసదుద్దీన్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనే కేసీఆర్ ఆలోచన వెనక బహుశా ఆ లెక్కలు ఉండి ఉంటాయని చెప్పవచ్చు. తెలంగాణలో కాంగ్రెసు టీఆర్ఎస్ తర్వాత అతి పెద్ద పార్టీగా ఉండడంతో కేసీఆర్ కాంగ్రెసును జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థిగా ఎంచుకున్నారని చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లీస్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా, జగన్ తో జత కడుతుందా అనేది తేలాల్సి ఉంది. అయితే, చంద్రబాబుకు వ్యతిరేకంగా వివిధ వర్గాలను కూడగట్టడానికి మాత్రం కేసీఆర్ తో పాటు అసదుద్దీన్ పని చేస్తారనేది అర్థమవుతోంది. మజ్లీస్ ఇప్పటికే రాయలసీమలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది. వచ్చే శాసనసభ, లోకసభ ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉందని అర్థమవుతోంది. అయితే ఇది జ‌గ‌న్‌కు లాభం చేస్తుంద‌ని కొంద‌రు…చేటు చేస్తుంద‌ని మ‌రొ కొంద‌రు అంటున్న‌మాట‌. ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌నేది ప్ర‌జ‌ల చేతుల్లో ఉంది. ప్ర‌జాల తీర్పు ఎలా ఉంటాదో వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -