Thursday, April 25, 2024
- Advertisement -

కేసీఆర్ కొత్త కేబినెట్.. ఈయన పక్కానట..

- Advertisement -

అసెంబ్లీ సాక్షిగా ఆగస్టు నుంచి పాలనను పరుగులు పెట్టిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ కోవలోనే మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నట్టు సంకేతాలు పంపినట్టు తెలిసింది. దీంతో నిన్న అసెంబ్లీలో కొత్త మంత్రులు ఎవరనే దానిపై సీరియస్ గా చర్చలు జరిగాయి.

అయితే మొన్నటి వరకు ఏపీని పాలించి తెలంగాణలో బలీయమైన శక్తిగా ఉన్న కమ్మ సామాజికవర్గానికి కేసీఆర్ కేబినెట్లో చోటు లేదు. హైదరాబాద్ లోని మీడియా,పారిశ్రామిక రంగం సహా శాసించే స్థితిలో ఈ కమ్మ సామాజికవర్గం వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో 2021లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమ్మలను సంతృప్తిపరచడం కేసీఆర్ కు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో కమ్మ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది.

తెలంగాణలో ఖమ్మంలో మాత్రం కమ్మ సామాజికవర్గానికి చెందిన పువ్వాడ అజయ్ గెలిచారు. పోయినసారి మంత్రిగా చేసిన కమ్మనేత తుమ్మల ఓడిపోయారు. ఓడిన నేతలకు మంత్రివర్గంలో చోటు లేదని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ పువ్వాడ అజయ్ కు కమ్మలాబీని సంతృప్తి పరిచే లాబీయింగ్ చేసే శక్తి లేదని నాయకులు అంచనావేస్తున్నారు.

అందుకే మరోసారి కమ్మ కోటాలో తుమ్మలను మంత్రివర్గంలోకి కేసీఆర్ తీసుకోబోతున్నారనే చర్చ సాగుతోంది. తుమ్మలను తీసుకొని కమ్మలతో స్నేహహస్తం చాటడంతోపాటు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను రచించే బాధ్యతను అప్పగించాలని కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు అర్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -