Friday, April 26, 2024
- Advertisement -

బాబు గుండెల్లో పేలిన కేసీఆర్ లేటెస్ట్ స‌ర్వే బాంబ్‌… ఏపార్టీకి ఎన్నిసీట్లంటే…?

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌లు ఏమోగాని ప్ర‌స్తుతం డాటా చోరీపై రాజ‌కీయాలు వేడెక్కాయి. డేటా చోరీ వ్వ‌హ‌రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల స‌మ‌స్య‌గా మార్చి బాబు ప‌బ్బం గ‌డుపుకుంటుంన్నారు. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అన్ని స‌ర్వేలు తేల్చి చెప్ప‌డంతో బాబు మ‌రో సారి అధికారంలోకి రావ‌డానికి అన్ని అడ్డ దారులు తొక్కుతున్న సంగ‌తి ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో సంస్థ‌లు స‌ర్వేలు చేయ‌డం మామూలే. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని జాతాయ‌, ప్రాంతీయ సంస్థ‌లు చేసిన స‌ర్వేలో త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఫ‌లితాలు ఇచ్చాయి. బాబు చేయించుకున్న సొంత స‌ర్వేలో కూడా టీపీకీ వ్య‌తిరేకంగా ఫ‌లితాలు రావ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో బాబు ఉన్నారు.

ప్ర‌స్తుతం తెలంగాణా సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్ర‌బాబ‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డివేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు ఉన్నాయి. బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టినుంచి బాబు మండి ప‌డుతున్నారు.టీడీపీనీ ఓడించేందుకు కేసీఆర్‌, జ‌గ‌న్‌, భాజాపా కుట్ర‌ప‌న్నుతున్నార‌ని ఆరోపించిన బాబుకు…ఇప్పుడు కేసీఆర్ మ‌రో షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో కేసీఆర్ చేసిన లేటెస్ట్ స‌ర్వే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ స‌ర్వేలో వైసీపీ బంప‌ర్ మెజారిటీతో అధికారంలోకి రానుంద‌ని స‌ర్వేలో వెల్ల‌డ‌య్యింది. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా వైసీపీ95 నుంచి 110 సీట్లు, అధికార పార్టీ టీడీపీకీ 55, ఇత‌రులు 10 నుంచి 20 స్థానాలు కైవ‌సం చేసుకుంటార‌ని స‌ర్వే తేల్చి చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -