Thursday, April 25, 2024
- Advertisement -

కాంగ్రెస్ కు కేసీఆర్ చెక్.. ఎమ్మెల్సీ కోసం కొత్త ఆయుధం..?

- Advertisement -

కేసిఆర్ రాజకీయ చతురత, విజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వం తనది కాకపోయినా, మంత్రి వర్గంలో పనిచేసిన అనుభవం ఎక్కువగా లేకపోయినా కేంద్రం మెడలు వచ్చి అయన తెలంగాణా రాష్ట్రాన్ని తెచ్చిన తీరు ను చూస్తే ఆయనకు తెలంగాణా గాంధీ అనే పేరు సరైనదే అని చెప్పొచ్చు.. ఇక వరుసగా రెండోసారి ఎదురు లేకుండా గెలిచి ముఖ్యమంత్రి గా రెండు సార్లు తెలంగాణ కు పనిచేసిన వ్యక్తిగా నిలిచిపోయారు. ఇక ప్రస్తుతం అయన ద్రుష్టి మొత్తం తెలంగాణ‌ శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్‌ కోటా స్థానాల భర్తీపై ఉంది.. 

ఇప్పటికే యా స్థానాలు ఎవరికీ ఇవ్వాలనేది కసరతు చేస్తున్న ఆయనకు పీవీ కుమార్తె రూపం లో ఓ సమాధానం దొరికింది. ‌వచ్చే నెల ఏడో తేదీన ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు ప్రారంభానికి ముందు జరిగే కేబినెట్‌ సమావేశంలోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యం తో ఉన్న కేసిఆర్ పలువురిని పరిశీలించి ఒక స్థాననికి  మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి పేరు ప్రతిపదిస్తున్నారట..

మండలిలో నాలుగు స్థానాలు ఉండగా నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా స్థానానికి ఎన్నికల షెడ్యూలు ప్రకటించగా, మాజీ ఎంపీ కవిత టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అయితే కరోనా వల్ల జరగలేదు. శాసన మండలిలో గవర్నర్‌ కోటా సభ్యుల సంఖ్య ఆరు కాగా, ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.ఇప్పటికే ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్, పార్టీ నేతలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు  తమ ఎమ్మెల్సీ పదవులు దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ స్థానానికి నాయిని కోడా పోటీ లో ఉన్నట్లు తెలుస్తుంది. నాయినికి అవకాశం దక్కనిపక్షంలో ఆయన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక మల్కాజిగిరి లో లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన మర్రి రాజశేఖర్‌ రెడ్డి కూడా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -