Friday, March 29, 2024
- Advertisement -

ప్రియాంక హత్యపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇదే..!

- Advertisement -

ప్రియాంక రెడ్డి హత్య దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్యపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రియాంక రెడ్డి హత్య కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

కేసు సత్వర విచారణ కోసం పాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను కేసీఆర్ కోరారు. ప్రియాంకరెడ్డి విచారణ తీరుపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇటీవలే వరంగల్ లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ ముగిసి తీర్పు వెలువడిన విషయం ప్రస్తావనకు వచ్చింది.

అదే తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రియాంకారెడ్డి ఫ్యామిలీకి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాగా ప్రియాంకా రెడ్డి కేసు విచారణను వేగంగా చేపట్టి దోషులకు కఠినంగా శిక్ష పడేలా స్పెషల్ కోర్టుని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో.. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

ప్రత్యేక కోర్టు ఏర్పాటుపై హై కోర్టుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటైన వెంటనే రోజు వారి పద్దతిలో విచారణ జరిపి నిందితులకు త్వరిగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -