Friday, April 19, 2024
- Advertisement -

చంద్రబాబును ఉతికి ఆరేసిన కేసీఆర్..

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల వేల తెలంగాణా సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా చంద్రబాబు కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఏపీకీ పత్యేక హోదాకు కేసీఆర్ మద్దతిస్తారని చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. ఏపీ ప్రజలతో తమకు ఎలాంటి వైరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు వంటి వాళ్లతోనే తమకు గొడవలని అన్నారు. చంద్రబాబు కహానీ ఖతం అయిందని.. చిత్తుగా ఓడిపోబోతున్నారని అన్నారు. చంద్రబాబులా చీకటి పనులు, కుట్రలు తాము చేయలేమని కేసీఆర్‌ అన్నారు.

ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ అడ్డుపడుతున్నారని ఏపీలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ క్లారిటీ ఇచ్చారు. నీ లాగా పొద్దున్నే లేచి మందికి గోతులు తీయం. తెలంగాణకు కుట్రలు చేయడం రాదు. లోక్‌సభలోనూ టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రత్యేక హోదాకు మద్దతిచ్చారని గుర్తు చేశారు. మరో వైపు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఆంధ్రా ప్రజలు మంచివాళ్లు.. వాళ్లతో మాకేం కిరికిరి లేదు. చంద్రబాబు లాంటి పిడికెడు మందితో తప్ప ఏపీ ప్రజలతో మాకు పంచాయతీ లేదన్నారు. గోదావరి జలాలు వేస్ట్ గా సముద్రం పాలవుతున్నాయని ఆ నీటినంతా రెండు తెలుగు రాష్ట్రాలు అవసరాలకు ఉపయేగించుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కట్టుకోమని చెప్పాం. మా వాటా మాకు కావాలన్నామే తప్ప పోలవరం కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదనిన్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా ఏపీ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ ప్రత్యేకహోదా పై అనేక విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదాకు మద్దతునిస్తారని జగన్ కు కేసీఆర్ చెవిలో చెప్పారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాటన్నింటికీ సమాధానంగా కేసీఆర్ ఆ విషయంపై మరోసారి తమ వైఖరిని స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్ర ప్రయేజనాలకోసం టీఆర్ ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని మరో సారి పునరుద్ఘాటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -