Friday, March 29, 2024
- Advertisement -

కేసీఆర్ సంచలన నిర్ణయం : పదో తరగతి విద్యార్థులు పాస్..!

- Advertisement -

కరోనా వల్ల పదో తరగతి పరీక్షలు వాయి పడిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు ఉంటాయో ఉండవో అనే విషయంపై చర్చ జరిగింది. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలను పూర్తిగా రద్దు చేసేశారు.

పరీక్షలతో సంబంధం లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేశారు. ఇంటర్నల్స్, అసెస్ మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను పాస్ చేశారు. సీఎం నిర్ణయంతో మొత్తం 5,34,903 మంది విద్యార్థులు తదుపరి క్లాసులకు వెళ్లనున్నారు. ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడులను నిర్ణయించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పదో తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద టెన్షన్ తొలగిపోయింది.

మరోవైపు, డీగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షల సందర్భంగా విద్యార్థులకు కరోనా సోకితే బాధ్యులెవరని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో, పరీక్షలను నిర్వహించడం కంటే… విద్యార్థులను ప్రమోట్ చేయడం ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -