గట్టిగానే చెమటోడుస్తున్న హరీష్ రావు.. కెసిఆర్ కూడా వస్తే బాగుంటుంది..

- Advertisement -

దుబ్బాక లో రోజు రోజు కి రాజకీయ వాతావరణం మారిపోతుంది.. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అక్కడి రాజకీయం కాస్త వేడిగా మారిపోయింది.. పార్టీ లు అన్నీ విమర్శలు చేస్తూ ఎదుటి పార్టీ ని కృంగదీసే ప్రయత్నం చేస్తున్నాయి.. చేరికలు ఒక పార్టీ నుంచి మరో పార్టీ కి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎ పార్టీ ఎప్పుడు పుంజు కుంటుందో అర్థం కావట్లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరకు శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే వేయనున్నారు.. ఇక్కడ ప్రచారానికి రేవంత్ రెడ్డి వంటి వారు వస్తున్నారు. దీంతో అధికార పార్టీ కి గట్టి పోటీ ఖాయం అని తెలుస్తుంది..

ఇక అధికార పార్టీ పూర్తి గా హరీష్ రావు నే నమ్ముకుందని చెప్పాలి.. అయన తన సొంత నియోజకవర్గంలా ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నారు.. కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై శ్రద్ధ వహించగా, కేటీఆర్ గ్రేటర్ పై ద్రుష్టి సారించారు.. దాంతో హరీష్ రావు కి దుబ్బాక ని ఇచ్చారు.. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలుపు ఢంకా మోగించాలని కేసీఆర్ ఆదేశాలిచ్చారట.. సాదా సీదా విజయం కాదు ఇక్కడి గెలుపు తో విర్రవీగిపోతున్న ప్రతిపక్షాల నోళ్లు మూయించేలా గెలుపు కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారట..

- Advertisement -

గత ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డికి వచ్చిన ఓట్లకు మించి ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని కేసీఆర్ అన్నారట.. ఇందులో భాగంగానే ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని దాదాపుగా అన్ని గ్రామాలను మంత్రి కలియ తిరిగారు. అంతటితో ఆగకుండా మండలాలకు ఎమ్మెల్యే స్థాయి నాయకులను ఇన్‌చార్జిలుగా నియమించారు. అదేవిధంగా తనదైన శైలిలో కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువతతో సమీక్షలు, సభలు నిర్వహంచి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. అయితే కొంతమంది తెరాస నాయకులూ హరీష్ రావు కి కేసీఆర్, కేటీఆర్ కొంత సపోర్ట్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.. ప్రతిపక్షాలు అన్ని ఏకతాటి గా ఉన్నాయి, అధికార పార్టీ తరపున హరీష్ రావు ఒక్కడే అయిపోయాడు అని భావిస్తున్నారట.. మరి కేసీఆర్ ఎలక్షన్స్ టైం కల్లా వచ్చి పార్టీ ని మరింత బలం గా మారుస్తాడా అన్నది చూడాలి..

టీఆర్ఎస్ అంతకుమించి ప్లాన్ చేసిందా..?

హరీష్ రావు వద్దకు దుబ్బాక ప్రజలు.. మాట ఇస్తున్నారా..?

దుబ్బాక లో టీఅరెస్ గెలుపు ఖాయం…

దుబ్బాక లో ఎవరి బలం ఎంత..?

Most Popular

పవన్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ కు దూరంగా ఉన్న సెలబ్రిటీలు.. ఇప్పుడు షూటింగ్ లో పాల్గొంటున్నారు. కానీ కొందరు మాత్రం ఇంకా షూట్ లో పాల్గొనడం లేదు. అందులో...

నా బెస్ట్‌ఫ్రెండ్‌ ట్రాన్స్‌జెండర్ : ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల చాలా పెద్ద సెలబ్రిటీ అయినప్పటికి.. మాములు వ్యక్తిలా ఉంటూ అందర్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తన భర్తకు సంబంధించిన అప్...

కోట్ల ఆస్తులును జగపతి బాబు ఎలా పోగొట్టుకున్నాడో తెలుసా ?

ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు జగపతి బాబు. హీరోగా జగపతి బాబుకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. జగపతి బాబు తండ్రి నిర్మాత...

Related Articles

ఆ రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్

వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. క్వింటాళుకు రూ.1,850...

కెసిఆర్ నిధులు బాగానే సంపాదించుకోస్తున్నాడే..

భారీవర్షాలు భాగ్య నగరాన్ని ఎలా ముంచెత్తాయి అందరికి తెలిసిందే.. వర్షాల దెబ్బకు సిటీ మొత్తం సముద్రంలా మారగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.. నగరంలోని మూసి పరివాహక ప్రాంత వాసులు...

టీఆర్ఎస్ వ్యూహాన్ని మార్చే టైం వచ్చిందా..?

కేసీఆర్ ఏది చేసినా సంచలనమే.. తెలంగాణ తీసుకువచ్చే దగ్గరినుంచి నిన్నటి రెవెన్యూ చట్టంలో మార్పుల వరకు అన్ని కేసీఆర్ నిర్ణయాలు చరిత్ర ని తిరగరాసినవే అని చెప్పుకోవాలి.. మొదటి సారి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...