Thursday, April 25, 2024
- Advertisement -

తెలంగాణా అసెంబ్లీ లో వైఎస్సార్ స్మరణ..?

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవ అలాంటిది ఇలాంటిది కాదు.. సొంత నియోజకవర్గం కన్నా ఎక్కువగా రాజశేఖర్ రెడ్డి తెలంగాణా ను అభిమానించే వారు.. పథకాల అమలులో కూడా అయన దగ్గరుండి ప్రజలకు చేరుతున్నాయి లేదో చూసుకునేవారు.. అందుకే అక్కడి ప్రజలకు వైఎస్సార్ అన్నా కాంగ్రెస్ పార్టీ అంత ప్రేమ.. పార్టీ సంగతి పక్కనపెడితే వైఎస్సార్ తెలంగాణా లో తన పాలనలో ముద్ర వేశారని చెప్పొచ్చు.. ఆరోగ్యశ్రీ , ఫీజు రీ అంబర్స్మెంట్ వంటి కీలక పథకాల్లో వైఎస్సార్ కు వందకు వంద మార్కులు వేశారు ప్రజలు..

తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు అందరికి తెలిసిందే.. ప్రమాదవశాత్తు రాజశేఖర్ రెడ్డి చనిపోవడం, తెలంగాణా రాష్ట్రం విడిపోవడం వంటివి చక చక జరిగిపోయాయి.. ఇప్పుడు తెలంగాణాలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండగా ఇప్పటికీ అక్కడ వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలు కొన్ని కొనసాగిస్తుండడం విశేషం.. వాటిలో ముఖ్యంగా ఆరోగ్య శ్రీ పథకం.. ఈ పథకం పై కోట్లాది మంది ప్రజలు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లారు.. దీనికి వైఎస్సార్ కి రుణపడి ఉంటామని ఇప్పటికి చెప్తుంటారు..

ఇక కేసీఆర్ సైతం ఈ పతాకాన్ని పొగడకుండా ఉండలేకపోయారు.. తెలంగాణా లో వర్షాకాలసమావేశాలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.. పలు అంశాలపై చర్చించిన కేసీఆర్ ఆరోగ్య శ్రీ పథకం పై ప్రశంశల జల్లు కురిపించారు.. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అయుష్మాన్ భారత్ పథకం కంటే ఆరోగ్య శ్రీ చాలా బెటర్ అని అన్నారు.. ఆరోగ్యశ్రీ తో పోల్చితే ఆయుష్మాన్ భారత్ పధకంతో నష్టం వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ మాటతో కేసీఆర్ ప్రజల మనసుని మరొకసారి గెల్చుకున్నారు.. కాంగ్రెస్ తరపున గెలిచినా వైఎస్సార్ తెచ్చిన పతాకాన్ని తాము పేరు కూడా మార్చలేదని, తనకి భేశాజాలు లేవని, మంచిని మంచిగా , చెడుని చెడు గా చూసే విజ్ఞత తనకి ఉందని అన్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -