జగన్ తన వ్యూహాలతో బాబును తికమక పెట్టాడు.. ?

763
kodali nani challenges chandrababu on three capitals
kodali nani challenges chandrababu on three capitals

ఏపీ మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంతో టీడీపీలో టెన్షన్ మొదలైంది. దాంతో చంద్రబాబు ఖండించి నానా యాగీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలవైపు అడుగులు వేస్తారన్నది చర్చనీయం అయింది. అయితే జగన్ అండ్ కో మాత్రం వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని ఫిక్స్ అయింది. అందుకే తాజాగా మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది.

“మూడు రాజధానుల బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా చంద్రబాబు, 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామా చేసేందుకు నిర్ణయించారని.. అందుకే గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాలు అందించనున్నట్లు..” సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం వెనుక వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును కావాలనే రాజీనామా చేయించి ఉన్న 23 సీట్లను కూడా చేజిక్కించుకోవాలని వైసీపీ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

అందుకే మంత్రి నాని ఎంట్రీ ఇచ్చి.. దమ్ముంటే రాజీనామా చేయి చంద్రబాబు అని సవాల్ విసిరారు. బాబుకు దమ్ముంటే.. ఆయనకు ఉన్న 20మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. ఉప ఎన్నికల్లో 20కి 20 సీట్లు గెలిస్తే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉందని నాని అన్నారు. ఒక వేళ బాబు ఉప ఎన్నికల్లో ఓడిపోతే జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని అన్నారు. ఇక కొంతమంది వైసీపీ నేతలు కూడా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం రాజీనామా చేయి బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా చంద్రబాబు అమరావతి వంకతో రాజీనామా చేస్తే.. గెలవడం అనేది ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితుల్లో జరగదని జగన్ అండ్ కో గట్టిగా నమ్ముతోంది. అయితే వైసీపీ ముందు ఓటమిని చూడలేని బాబు.. రాజీనామాలు ఏం చేయడం లేదని చెబుతున్నారు. సో జగన్ మొత్తానికి తన వ్యూహాలు ఎవరికి చిక్కకుండా వేసి.. అనుకున్నదే చేశాడు. బాబుకు ఊహించని షాక్ ఇచ్చాడు.

జగన్ కమిట్మెంట్ చూసి షాక్ అయ్యా.. కానీ మోసం : రఘురామ

చంద్రబాబుకు కొడాలి నాని ఊహించని సవాల్..!

ఆ మంత్రులందరికీ షాక్ ఇవ్వనున్న సీఎం జగన్..?

సీనియర్లకు షాక్.. జూనియర్లకు పదవులు.. జగన్ వ్యూహం ఏంటి ?

Loading...