Thursday, March 28, 2024
- Advertisement -

కొల్లు రవీంద్రను అరెస్ట్ పై స్పందించిన కొడాలి నాని

- Advertisement -

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడిన వైసీపీ మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేత మోకాభాస్కర్ రావు హత్యకేసులో కొల్లు రవీంద్ర పాత్ర మాత్రమే కాదు దేవినేని ఉమా, చంద్రబాబు హస్తం కూడా ఉండి ఉంటుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొల్లు రవీంద్ర సూచనమేరకు హత్య చేసామని నిందుతులు పోలీసుల ముందు చెప్పడంతో.. కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్లుగా తేలడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా కొల్లు రవీంద్ర దొంగలా పారిపోవడానికి ప్రయత్నం చేశారంటూ కొడాలి నాని పేర్కొన్నారు. హత్యలో తన హస్తం ఉందన్న భయంతోనే పారిపోయేందుకు ప్రయత్నించాడని.. అందుకే పోలీసులు అరెస్ట్ చేశారని కొడాలి నాని పేర్కొన్నారు. మొదటి నుండి మచిలీపట్నం రాజకీయాలలో కీలక భూమిక పోషింస్తూ.. వైసీపీ మంత్రి పేర్నినానికి ముఖ్య అనుచరుడిగా మోకా భాస్కర రావు ఉంటున్నాడు.

అయితే కొల్లు రవీంద్రకు మోకా అడ్డుగా ఉన్నాడని.. అందుకే హత్య చేయించారని కొడాలి నాని పేర్కొన్నారు. పోలీసుల దగ్గర ఈ హత్యకేసులో రవీంద్ర పాత్రపై పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు. వైసీపీ ఉన్న బలహీన వర్గాలకు చెందిన నాయలను చంపితే పార్టీ బలహీన పడుతున్న భావనతోనే బలహీన వర్గాలకు చెందిన వారిని టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. పోలీసులు అన్ని ఆధారాలతోనే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారని ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏం ఉంటుందని ప్రశ్నించారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే అని పేర్కొన్నారు కొడాలి నాని.

అనుచరుడి భాస్కరరావు అంత్యక్రియల్లో కుప్పకూలిన నాని..!

1,088 అంబులెన్స్‌లను ప్రారంభంచిన జగన్ సర్కార్..!

పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాపాక వరప్రసాద్

మహిళా ఉద్యోగినిపై దాడి చేసిన సహ ఉద్యోగి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -