Thursday, April 25, 2024
- Advertisement -

కోడెల ఆత్మహత్యపై మొదలయిన రాజకీయాలు…

- Advertisement -

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణంపై రాజకీయ దుమారం మొదలైంది. అప్పడే టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది.ఆయనది ఆత్మహత్యా,గుండెపోటా అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. పోస్ట్ మార్టం నివేదిక తర్వాతనె నిజాలు తెలుస్తాయని ఒకవైపు చెప్తున్నా టీడీపీ నేతలు మాత్రం వైసీపీ ని టార్గెట్ చేశారు.

కోడెలను కేసులతో వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని… ఇందుకుగానూ ఏపీ ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు కూడా కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బుద్దావెంకన్న నేతలు కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తిప్పికొట్టారు.సీనియర్ నాయకుడు చనిపోయాడన్న బాధ కూడా లేకుండా టీడీపీ నేతలు తమపై బురదజల్లుతారా? అని ప్రశ్నించారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి.వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని, ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదని టీడీపీ నేతలకు హితవు పలికారు. పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. వారు చేసిన వ్యాఖ్యలను వారి విజ్ణతకే వదిలేస్తున్నామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -