Thursday, April 25, 2024
- Advertisement -

తెలంగాణ‌లో కుబేరుడు ఎవ‌రో తెలుసా..?

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నామినేష‌న్లు నిన్న‌టితో ముగిశాయి.అభ్య‌ర్థులు త‌మ ఆస్తుల వివరాలు ఎన్నిక‌ల క‌మిష‌న్ ముందు ఉంచాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న అభ్యర్ఠుల అందరిలోకి అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలిచారు.నల్గొండ జిల్లా మునుగోడు నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన మొత్తం ఆస్తులు రూ.366 కోట్లు. వీటిలో చరాస్తులు రూ.266 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ.100 కోట్లు. ఇక ఆ తర్వాతి స్థానంలో నాగర్‌కర్నూలుకు చెందిన టీఆర్ఎస్ నేత మర్రి జనార్థన్ రెడ్డి నిలిచారు.

మర్రి కుటుంబసభ్యుల ఉమ్మడి ఆస్తి విలువ రూ.159 కోట్లు,శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి యోగానంద్ రూ..147 కోట్లు,సనత్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆస్తుల విలువ రూ.76 కోట్లు,ఖమ్మం జిల్లా పాలేరు ప్రజాకూటమి అభ్యర్థి కె.ఉపేందర్ రెడ్డి ఆస్తుల విలువ రూ.72 కోట్లు,వనపర్తి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొత్త అమరేందర్‌రెడ్డి ఆస్తులు రూ.63 కోట్లు. నారాయణపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి ఆస్తులు 57.93 కోట్లు. ఉప్పల్‌ టీడీపీ అభ్యర్థి వీరేందర్‌ గౌడ్‌కు 57.31 కోట్ల ఆస్తులున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -