Friday, March 29, 2024
- Advertisement -

బాబుకు లైఫ్ టైం షాక్…….. చేరికకు ముందే వెన్నుపోటు నైజం తెలుసుకున్న కోట్ల

- Advertisement -

దేవుడా…………చంద్రబాబు మార్క్ వెన్నుపోటు రాజకీయాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుగు నాట ఉన్న అందరు నాయకులకు తెలిసిపోయాయా? ఎన్టీఆర్ జమానాలో నమ్మించి వెన్నుపోటు పొడవడంలో సక్సెస్ అయిన చంద్రబాబు ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ లాంటి పసికూన పొలిటీషియన్‌తో పాటు నరేంద్రమోడీ లాంటి డక్కామొక్కీలు తిన్న నాయకులకు కూడా సక్సెస్‌ఫుల్‌గా వెన్నుపోటు పొడిచాడు. అయితే 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ చంద్రబాబుకు ఏదీ కలిసిరానట్టుగానే ఇప్పుడు ఆయన వెన్నుపోటు రాజకీయాల గురించి కూడా తెలుగు నాట ఉన్న నాయకులకు అందరికీ తెలిసిపోయినట్టుగా అనిపిస్తోంది. జాతీయస్థాయిలో కూడా తెలంగాణా ఎన్నికల తర్వాత రాహుల్‌కి చంద్రబాబు హ్యాండ్ ఇస్తూ ఉన్న వైనం గురించి చర్చలు జరుగుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలోనే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిలాంటి సీనియర్ నాయకుడు తాజాగా చంద్రబాబు మార్క్ వెన్నుపోటు రాజకీయాలను అర్థం చేసుకున్నాడని ఆయన అనుచరులు చెప్తున్నారు. చంద్రబాబుతో వ్యక్తిగతంగా డిన్నర్ మీటింగ్ జరిపిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సీట్ల విషయంలోనూ, ప్రజలకు చేయాల్సిన పనుల విషయంలోనూ కొన్ని కండిషన్స్ చంద్రబాబు ముందు పెట్టాడు. కోట్ల అడిగిన వెంటనే అన్నింటికీ యస్ అన్న చంద్రబాబు ఆ తర్వాత మాత్రం తన మార్క్ రాజకీయం మొదలెట్టాడు. అసలు నిజాలను వెంటనే అవగతం చేసుకున్న ఈ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు బాబు మార్క్ వెన్నుపోటు రాజకీయాలను టిడిపిలో చేరకముందే అర్థం చేసుకుని అలర్ట్ అయ్యాడు.

తాజాగా కోట్ల అనుచరులు, అభిమానులందరూ కూడా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిని కలిసి వెన్నుపోటు, అబద్ధాల చంద్రబాబును నమ్మవద్దని, వైఎస్‌ జగన్‌ని నమ్ముదామని కోట్లను అభ్యర్థించారట. ఆ వెంటనే మీడియా ముందుకు వచ్చిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టిడిపిలో చేరుతున్నానని నేను ఎప్పుడూ చెప్పలేదని చెప్పి చెప్పుకొచ్చాడు. అలాగే ఆల్రెడీ టిడిపిలో చేరాడు అన్నట్టుగా వార్తలు వండివార్చిన టిడిపి భజన మీడియా తోక పత్రిక, నంబర్ ఒన్ పత్రికను కూడా విమర్శించాడు కోట్ల. ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకోలేదని, తనకు జగన్ పార్టీ వైకాపాతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వైకాపాలో కూడా చేరొచ్చన్న అర్థం వచ్చేలా మాట్లాడి చంద్రబాబుకు షాక్ ఇచ్చాడు. ఆ వెంటనే టిడిపి మంత్రులను కోట్లతో రాయబారానికి చంద్రబాబు పంపారు. అయితే కోట్ల మాత్రం టిడిపిలో చేరడానికి ససేమిరా అంటున్నాడని తెలుస్తోంది. కోట్ల అభిమానులు కూడా వైకాపాలో చేరమని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా కోట్ల కూడా వైకాపా నేత విజయసాయిరెడ్డితో టచ్‌లోకి వెళ్ళారని తెలుస్తోంది. ఏది ఏమైనా డిన్నర్ మీటింగ్ ప్లాన్ చేసి, కోట్లకు భారీగా ఆర్థిక వనరుల హామీలు, ఇంకా ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ తనపైన నమ్మకంలేదని చెప్పి కోట్ల వైకాపాలో చేరే ప్రయత్నంలో ఉండడం మాత్రం చంద్రబాబుకు లైఫ్ టైం షాక్ అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -