అభిమాని పై సీరియస్ అయిన కేటీఆర్.. ఎందుకు ?

1446
KTR Anger Over Fan Who Tattoos on His Back
KTR Anger Over Fan Who Tattoos on His Back

కేటీఆర్.. కేసీఆర్ తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మరియు దేశ రాజకీయాలలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాధించుకున్నారు ఈ యంగ్ అండ్ డైనమిక్ పొలిటిషన్. ప్రస్తుతం టీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటూ మంత్రిగా కూడా బ్యాధతలని నిర్వర్తిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపేందుకు తనవంతు కృషి చేస్తున్నారు.

అలానే ట్విట్టర్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉండే రాజకీయనేతల్లో కేటీఆర్ ఒక్కరు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన ఏ సమస్యనైన వెంటనే పరిష్కారం చూపుతారు. ప్రజలకు ఏ అవసరమైన సరే ఆసరాగా నిలబడుతాడు. అందుకే ఆయనకు యూత్ లో విమరితమైన క్రేజ్. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ ఒక అభిమానిపై చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటివి నాకు నచ్చవు అంటూ వార్నింగ్ ఇచ్చారు. విషయంలోకి వెళ్తే.. రవికిరణ్ అనే యువకుడు కేటీఆర్ కు అభిమాని.

ఇతను తన వీపు పై కేటీఆర్ ఫోటో.. దానిపై డైనమిక్ లీడర్.. ఫోటో కింద జై రామన్న అనే అక్షరాలని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఆ ట్యాటుని ట్విట్టర్ లో కేటీఆర్ కి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఆ ఫోటో చూసిన మంత్రి కేటీఆర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది నిజమేనా ? సారీ తమ్ముడూ ఇలాంటివి వాటిని నేను అంగీకరించను. సపోర్ట్ చేయను. ఇది ఆరోగ్యానికి హానికరం. బాధపెట్టే విషయం అంటూ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ తెలిపారు. ఇక మరికొంత మంది అభిమానులు మాత్రం జై రామన్న అంటూ ట్విట్టర్ లో ఆ పోస్ట్ రీ పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Loading...