Thursday, April 18, 2024
- Advertisement -

కేఈ, టీజీ, కోట్ల‌కు షాక్ ఇచ్చిన ఎస్వీ మోహ‌న్‌రెడ్డి…

- Advertisement -

ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుత‌న్నాయి. క‌ర్నూలు అసెంబ్లీ సీటు కోసం నాలుగు స్థంభాలాట జ‌రుతుతోంది. ఈ సీటుకోసం ఎస్వీమోహ‌న్‌రెడ్డి, కేయీ, కోట్ల‌, టీజీ వెంక‌టేష్ ఎవ‌రికి వారే పావులు క‌దుపుతున్నారు. సీటు కోసం ఎవ‌రికి వారే త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ టికెట్ మాకే న‌ని టీజీ వెంక‌టేష్ ప్ర‌క‌టించడంతో …ఎస్వీ మోహ‌న్‌రెడ్డి మాత్రం కొత్త రూటును ఎంచుకున్నారు. ఆ సీటు త‌న‌కు ద‌క్క‌క‌పోయినా ప‌ర్వాలేదు గాని ఇత‌రుల‌కు మాత్రం ద‌క్క‌కూడ‌ద‌ని భారీ ప్లాన్ వేశారు. ఈ స‌రిస్థితుల్లో నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ను టీడీపీ అధిష్ఠానం ఎవరికి కేటాయిస్తుందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇక్క‌డ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎస్వీ మోహ‌న్‌రెడ్డ ఉన్నారు. 2014లో వైసీపీ త‌రుపున గెలిచి త‌ర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. ఈ సీటుకోసం ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఈ టికెట్ ను ఆశిస్తున్నారు. దీంతో, కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేప‌థ్యంలో ఎస్వీ టీజీ, కోట్ల‌, కేయీ సోద‌రుల‌కు షాక్ ఇచ్చేవిధంగా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

నిన్న‌టి , మొన్నటి వరకూ ఎస్వీ కర్నూలు సీటు తనదే అని ధీమా వ్యక్తం చేసినా …. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సీటు ఎవరికి దక్కుతుందనేది అనుమానంగానే ఉంది. దీంతో సొంత పార్టీ ప్ర‌త్య‌ర్థుల‌కు షాక్ ఇచ్చే విధంగా నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్‌ రెడ్డి… కర్నూలు నుంచి ఒకవేళ నారా లోకేష్‌ పోటీ చేస్తే తానే స్వచ్ఛందంగా తప్పుకునేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు. అయితే మరో నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనని, టికెట్‌ కూడా అడగనని అన్నారు.

క‌ర్నూలు సీటు ఎస్వీకేన‌ని గతంలో మంత్రి లోకేష్ ప్ర‌క‌టించారు. అయితే త‌ర్వాత దీనిపై రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ ఒక స్థాయిలో మండిపడగా… మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు కోట్ల‌కూడా తొడ‌వ్వ‌డంతో ఎస్వీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

టీజీ, కేఈ వర్గానికి చెక్ పెట్టేందుకు ఆయన తాజాగా కర్నూలు నుంచి లోకేశ్‌ పోటీ చేయాలంటూ కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. అంతేకాకుండా పోటీ చేస్తే లోకేష్…లేదా నేనే… అంతేకానీ వేరేవాళ్లు కర్నూలు నుంచి పోటీ చేస్తే ఊరుకునేది లేదంటూ ఎస‍్వీ మోహన్ రెడ్డి హెచ్చ‌రించారు. రోజుకో మలుపు తిరుగుతున్న కర్నూలు అసెంబ్లీ టికెట్‌ చివరికి ఎవరికి దక్కే అదృష్ట‌వంతులు ఎవ‌రో….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -